More

    శ్రీశైలంలో వైభవంగా వారాంతపు సేవలు

    శ్రీశైల మహాక్షేత్రంలో వారాంతపు సేవలలో భాగంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవను ఆద్యాంతం వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయంలోని పురాతన దీపాలంకరణ మండపంలో ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి, అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో పూజలు జరిపారు. అనంతరం హారతులిచ్చి సహస్ర దీపాలను వెలిగించారు. సహస్ర దీపార్చన ముగిసిన అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తును వెండిరథంపై అశీనులనుజేసి ప్రత్యేక పూజలు చేశారు. మంగళహారతులిచ్చి ఆలయ ప్రాంగణంలో భక్తుల నడుమ ఆలయ ప్రదక్షిణగా వెండి రధోత్సవాన్ని నిర్వహించారు. ఈ పూజ కైంకర్యాలలో ఆలయ అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

    Trending Stories

    Related Stories