More

    శ్రీశైలంలో హైందవ సంఘాల రౌండ్‎టేబుల్ మీటింగ్

    నంద్యాల జిల్లా: శ్రీశైల దేవస్థాన పరిపాలన భవనంలో ఈవో లవన్న, దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో తెలుగురాష్ట్రాల హైందవ సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా దేవస్థాన గోశాల, ఆర్జితసేవలపై ఫిర్యాదులపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం హైందవ సంఘాల నాయకుడు లలిత్ మాట్లాడుతూ దేవస్థానంలో గోశాల, ఆర్జితసేవలు పలు సమస్యలపై గంటపాటు ఆలయ ఈవో అధికారులతో చర్చించామన్నారు. ఈవో లవన్నకు సమస్యలపై వినతి పత్రం అందజేసి సలహాలు, సూచనలు చేశామన్నారు. ముఖ్యంగా ”తెల్లరేషన్ కార్డ్ ఉన్న పేదలకు సేవలలో ఉచితంగా పాల్గొనేందుకు ఈవో సానుకూలంగా స్పందించారన్నారని తెలిపారు. దేవస్థానంలో జరుగుతున్న దానికి బయట జరుగుతున్న ప్రచారానికి పొంతనలేదన్నారు. ఈవో లవన్నతో జరిగిన ఈ సమావేశం సంతృప్తిని ఇచ్చిందన్నారు. సమావేశంలో తాము ఇచ్చిన ప్రతిపాదనలను చిన్న చిన్న సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తానని ఈవో లవన్న హామీ ఇచ్చారని హైదవ సంఘ నాయకులు తెలిపారు.

    Trending Stories

    Related Stories