తిరుమల శ్రీవారిని శ్రీపీఠం వ్యవస్ధాపకులు పరిపూర్ణానంద స్వామిజీ దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో పరిపూర్ణానంద స్వామిజీ స్వామి వారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పరిపూర్ణానంద స్వామిజీకి ఆలయ అధికారులు స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం తగదని, తిరుమలలో స్వామివారే ప్రధానమన్నారు. క్షేత్రం యొక్క పవిత్రత, ఔనత్యాన్ని మాత్రమే బయట వ్యక్త పరచాలన్నారు. పవిత్రమైన తిరుమల, కార్తీక దామోదర మాసం ఇది అని, ఈ మాసంలో ఈశ్వరుడిని, మహా విష్ణువుని ఒక అబేధ స్వరూపంగా ఆరాధిస్తామన్నారు. ఇక హరిహర స్వరూపంగా శ్రీ అయ్యప్పస్వామి వారికి ఆరాధనలు చేస్తామని పరిపూర్ణానందస్వామి చెప్పారు.