More

    ఆస్ట్రేలియాలో శ్రీలంక క్రికెటర్ అరెస్టు.. అత్యాచారం ఆరోపణలు..!

    టీ20 ప్రపంచ కప్ లో శ్రీలంక పెద్దగా సంచలనాలు సృష్టించకుండానే వెనుదిరిగిన సంగతి తెలిసిందే..! అయితే ఆ జట్టు సభ్యుడిపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. శ్రీలంక క్రికెట‌ర్ దనుష్క గుణతిలకను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం కేసులో అత‌డిని అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో న‌మీబియా చేతిలో ఓడిన శ్రీలంక జ‌ట్టులో గుణ‌తిల‌క స‌భ్యుడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో అత‌డు గాయ‌ప‌డి జ‌ట్టుకు దూరం అయ్యాడు. అత‌డి స్థానంలో అషెన్ బండార జట్టులో చేరాడు. అతడిని లంక జ‌ట్టు స్వ‌దేశానికి పంప‌లేదు. ఓ డేటింగ్ యాప్ ద్వారా దనుష్క గుణ‌తిల‌క‌కు ప‌రిచ‌య‌మైన 29 ఏళ్ల సిడ్నీ మ‌హిళ‌ త‌న‌పై గుణ‌తిల‌క లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేసింది. న‌వంబ‌ర్‌2న‌ సిడ్నీలోని ఓ నివాసంలో ఈ ఘటన జరిగింద‌ని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆస్ట్రేలియా మీడియా తెలిపింది. దీంతో సిడ్నీలోని టీమ్‌హోట‌ల్ నుంచి ఆదివారం తెల్ల‌వారుజామున అత‌డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు. “గత వారం సిడ్నీ తూర్పు ప్రాంతంలో ఒక మహిళపై జరిగిన లైంగిక వేధింపులపై విచారణ జరిపిన తర్వాత సెక్స్ క్రైమ్స్ స్క్వాడ్ డిటెక్టివ్‌లు శ్రీలంక జాతీయుడిపై అభియోగాలు మోపారు” అని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు.

    Trending Stories

    Related Stories