More

    మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి

    సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి మ్యాచ్ లో ఘోరమైన ఓటమిని ఎదుర్కొంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో సన్ రైజర్స్ బౌలర్లు, బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో సన్ రైజర్స్ దారుణ ఓటమిని మూటగట్టుకుంది. రాజస్థాన్ బ్యాట్స్ మెన్ విజృంభణ కారణంగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ జోస్ బట్లర్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 20 పరుగులు, కెప్టెన్ సంజూ శాంసన్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 55 పరుగులు, దేవదత్ పడిక్కల్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు, హెట్మెయర్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 2, నటరాజన్ 2, భువనేశ్వర్ 1, రొమారియో షెపర్డ్ 1 వికెట్ తీశారు.

    211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు హైదరాబాద్ ఏ దశలోనూ మెరుగైన రన్ రేట్ తో ముందుకు వెళ్ళలేదు. మార్కరమ్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు), రొమారియో (18 బంతుల్లో 2 సిక్సర్లతో 24 పరుగులు) వాషింగ్టన్ సుందర్ (14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు) రాణించారు. కెప్టెన్ విలియమ్సన్ తో సహా.. మిగతావారెవరూ సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ డకౌట్ కాగా, అభిషేక్ శర్మ 9 పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేసింది. యుజ్వేంద్ర చాహల్ 3, ట్రెంట్ బౌల్ట్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు. సంజు శాంసన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

    Trending Stories

    Related Stories