కేరళ దూరదర్శన్ కేంద్రంలో కామాంధులు ఎక్కువయ్యారు. తిరువనంతపురంలోని దూరదర్శన్ కేంద్రంలో మహిళ వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరా బయటపడడం కలకలం రేపుతోంది. ఆదివారం ఓ మహిళకు ఈ సీక్రెట్ కెమెరా దొరికింది. కేంద్రంలోని అధికారులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు తిరువనంతపురం సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు నమోదైంది.

దూరదర్శన్ కేంద్రంలోని మహిళల బాత్ రూమ్ లో హిడెన్ కెమెరాను వాష్‌రూమ్‌కి వెళ్లిన మహిళ గుర్తించింది. బుధవారం నాడు దూరదర్శన్ కేంద్రం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల వాష్‌రూమ్‌లో ఆ సంస్థ తాత్కాలిక ఉద్యోగి కెమెరాను ఇన్‌స్టాల్ చేసినట్లు గుర్తించారు. అతడిని విధుల నుంచి తొలగించినట్లు అధికారులు చెప్పారు. దూరదర్శన్ కేంద్రంలోని మెయిన్ స్టూడియో సమీపంలోని వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాను నిందితుడు పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దూరదర్శన్ కేంద్రం అధికారులతో కూడిన మహిళా కమిటీ, క్రమశిక్షణా కమిటీలు విచారిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరువనంతపురం సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కెమెరా ఒక్కటేనా.. ఇంకా చాలా మందివి ఉన్నాయా అనే విషయమై ఆరా తీస్తున్నారు. ఇంటర్నెట్ లో వీడియోలను పెట్టేశారేమోననే అనుమానాలు కూడా అక్కడి ఉద్యోగినులను వెంటాడుతూ ఉన్నాయి.