National

క్లినికల్ ట్రయల్స్ లేకుండానే స్పుత్నిక్ లైట్ ను తీసుకు రాబోతున్నారా..?

భారత్ లో వ్యాక్సిన్ ల కొరత లేకుండా చూడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తూ ఉంది. ముఖ్యంగా ఫార్మా కంపెనీలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వారి సమస్యలను తీరుస్తూ వెళుతోంది. వారిచ్చే సూచనలను, సలహాలను కూడా పరిగణలోకి తీసుకుని కావాల్సిన సహాయం చేస్తూ ఉంది భారత ప్రభుత్వం. ఇతర దేశాల్లో తయారు చేయబడి.. అక్కడ క్లినికల్ ట్రయల్స్ చేసుకున్నా.. ఆ రిపోర్టుల ఆధారంగానే భారత్ లో అనుమతులు దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లు భారతీయులకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమై ఉంది. ఇలాంటి తరుణంలో రష్యా తయారీ చేసిన సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ లైట్’ ను భారత్ లో డాక్టర్ రెడ్డీస్ ఫార్మా సంస్థ పంపిణీ చేయాలని భావిస్తోందట..!

స్పుత్నిక్ లైట్ కరోనా వ్యాక్సిన్ కు ఇటీవలే రష్యాలో వినియోగానికి ఆమోదం లభించింది. ఇప్పటికే భారత్ లో స్పుతిక్ వి (రెండు డోసుల వ్యాక్సిన్) పంపిణీ, తయారీకి ఒప్పందం కుదుర్చుకున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ ఈ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ను కూడా భారత్ కు తీసుకుని రావడానికి సిద్ధమైందని అంటున్నారు. భారత్ లో మళ్లీ ప్రత్యేకంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలంటే మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీంతో స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ కు భారత్ లో క్లినికల్ ట్రయల్స్ నుంచి మినహాయింపు కోరాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సంస్థ భావిస్తోంది. కేవలం సాంకేతిక పరిజ్ఞానం బదిలీ మాత్రమేనని.. ఇక్కడ వ్యాక్సిన్ ను మళ్లీ అభివృద్ధి చేయడం ఏమీ ఉండదని ఫార్మా కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని భారత ఔషధ నియంత్రణ రెగ్యులేటరీ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం చెబుతోంది. భారత ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

20 − nineteen =

Back to top button