అంటేనేమో అన్నారంటారు..! కానీ చెప్పక తప్పదు.! ఎందుకంటే ఇది కల్పిత కథకాదు..! అందరూ తెలుసుకోవాల్సిన చెదు నిజం.! నిజమనేది అబద్దమంతా అందంగా ఉండదు.! అసలు అందమే అబద్దమనేది… మరోక కథ అవుతుంది.! ఇక నిజమనేది ఎప్పుడు చేదుగాను…, నిష్టురంగానే కనిపిస్తోంది. అబద్దమంతా తొందరగా… నిజం జనాలకు చేరదు. నిజమనేది నిలకడ మీదనే తెలుస్తుంది.! దాదాపు 70 ఏళ్ళ పాటు గాంధీ నెహ్రూ కుటుంబం దేశ వనరులను తమ సొంత అవసరాల కోసం యాధేచ్చగా వాడుకున్న తీరుకు సంబంధించిన అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులోనూ ఈ స్టోరీ అయితే ఔరా ఇలా చేశారా? అని అనిపించకమానదు.!
జవహర్ లాల్ నెహ్రూ గురించి చెప్పాడానికి పర్యాయపదాలు వాడితే ఎలా ఉంటుంది? భారత మొదటి ప్రధాని, భారత తొలి ప్రధాని అయినా ఇందిరా గాంధీ జనకుడు ! అలాగే రాజీవ్ గాంధీకి తాత…, ఇంకా రాహుల్ గాంధీకి అయితే ముత్తాత..!
జవహర్ లాల్ నెహ్రూ… ఐశ్వర్యంలోనే పుట్టిపెరిగిన స్వాతంత్ర్య సమరయోధుడు.! స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని తమ సర్వస్వం కోల్పోయిన జాతీయ నాయకులకు కొదవలేదు. మన తెలుగునాట అయితే మనకు ప్రకాశం పంతులుగారి జీవిత చరిత్రే గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ రోజుల్లోనే కోట్లాది రూపాయలు సంపాదించిన ఆయన స్వాతంత్ర్య పోరాటంలో దిగిన తర్వాత తన ఆస్తులన్నింటీని కోల్పోయాడు. తన చివరి రోజుల్లో చిరుగు దుస్తులతో… కడు పేదరికంలో కన్నుమూశారు.
అదేంటో కానీ గాంధీ నెహ్రూ ఫ్యామిలీ విషయం వచ్చేసరికి మాత్రం స్టోరీ డిఫరెంట్..! స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న తర్వాత కూడా… నెహ్రూ కుటుంబ ఆస్తులు ఏమంతా కూడా కరిగిపోలేదు. పైగా రెట్టింపు అయ్యాయి. అంతేనా… అందరి చందాలతో ఆనాడు… నెహ్రూ ఏర్పాటు చేసిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన వేల కోట్లా రూపాయల ఆస్తులను రాత్రికి రాత్రే.., అటు సోనియా గాంధీ, ఇటు రాహుల్ గాంధీ, మరోవైపు ప్రియాంక వాద్రా గాంధీ ఎలా సొంతం చేసుకున్నది దేశం మొత్తం చూశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఇదే కేసులో సోనియా, రాహుల్ బెయిల్ పై ఉన్నారనే విషయం మనం మర్చిపోరాదు. అంతేలే విత్తు ఒకటైతే చెట్టు ఇంకొకటి ఒకటవుతుందా..?
ఇక అసలు విషయానికి వస్తే.., ఈ మధ్యనే ఓపీ ఇండియా అనే ఓ వెబ్ పోర్టల్ మన తొలి ప్రధాని నెహ్రూకు సంబంధించిన త్రిబుల్ ఫైవ్ సిగరేట్ కహానీని బయటపెట్టింది. ప్రధాని నెహ్రూకు సిగరేట్ తాగడం అలవాటు. ఈ విషయాన్ని ఆయన ఎన్నుడూ దాచుకోలేదు. అంతేకాదు సిగరేట్ తాగుతూ… ఫోజులిచ్చిన ఫోటోలు మనకు ఇప్పటికి కూడా గుగూల్ లో దర్శనం ఇస్తుంటాయి. ఆయన ఎప్పుడు త్రిబుల్ ఫైవ్ సిగరేట్ నే వాడేవారు. ఆ రోజుల్లో ఆ సిగరేట్ ధర కూడా మామాలు బ్రాండ్ సిగరేట్ల కంటే చాలా ఎక్కువగా ఉండేది.
నెహ్రూ…ఒకసారి మధ్యప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా… రాజధాని భోపాల్ లోని రాజ్ భవన్ లో నైట్ స్టే చేశారు. రాత్రి భోజనం తర్వాత ఆయన తప్పక సిగరేట్ తాగేవారు. రాజ్ భవన్ స్టోర్ లో నెహ్రూ వాడే త్రిబుల్ ఫైవ్ బ్రాండ్ సిగరేట్లు లేవు. దీంతో భోపాల్ నగరంలో త్రిబుల్ ఫైవ్ బ్రాండ్ సిగరేట్ల కోసం అంతా సెర్చ్ చేశారు. నగరంలో ఎక్కడ కూడా త్రిుబల్ ఫైవ్ సిగరేట్ల స్టాక్ లేకపోవడంతో ఇండోర్ లో వాకబు చేశారు. అక్కడ త్రిబుల్ ఫైవ్ సిగరేట్లు ఉన్నాయని తెలియడంతో… వాటిని వెంటనే తెచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని ఇండోర్ కు పంపించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన ఆ త్రిబుల్ ఫైవ్ సిగరేట్ పెట్టెలను వెంటనే నెహ్రూ కోసం రాజ్ భవన్ కు తరలించారు. రాజభవన్ కు సంబంధించిన అధికారిక సైట్ లోనే ఆనాటి ఘటనకు సంబంధించిన ఈ వృత్తాంతమును మెన్షన్ చేయడం జరిగింది.
నెహ్రూ సిగరేట్ల కోసం ఏకంగా ప్రత్యేక విమానమే ఏర్పాటు చేస్తే…, ఇక 1987లో రాజీవ్ గాంధీ, ఆయన కుటుంబ సభ్యులు, అలాగే ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీకి సంబంధించిన విదేశీ బంధువులతో కలిసి ఏకంగా… భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్ లో విహారయాత్ర చేశారు. అంతే కాదు వారి సేవ కోసం ఒక ఆర్మీ హెలికాప్టర్ ను సైతం 24×7 అందుబాటులో ఉంచారని…వీరందరూ లక్ష్య ద్వీప్ లో పది రోజుల పాటు గడిపారని… స్వయంగా ప్రధాని మోదీ… 2019 ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు డొంక తిరుగుడు కథనాలతో మోదీ చేసిన ఆరోపణలను సైడ్ లైన్ చేయడం జరిగింది.
ఇవన్నీచూస్తుంటే… దేశ వనరులను, ఆస్తులను, తమ వ్యక్తిగత సుఖ సౌక్యాల కోసం వాడుకోవడమనేది గాంధీ నెహ్రూ కుటుంబం తమ హక్కు భావిస్తోందా.? దేశ ప్రజలరా ఒక్కసారి ఆలోచించండి.