ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వండే ఆహరంపై ఉమ్మివేస్తున్న ఘటనలు చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆహారంపై ఉమ్మి వేసిన మరో ఘటన వెలుగు చూసింది. షాదాబ్ అనే వ్యక్తి ఈ ఘటనలో నిందితుడని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. నిశ్చితార్థ వేడుకలో షాదాబ్ తందూరి రోటీపై ఉమ్మి వేసిన ఘటన సంచలనమైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షాదాబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. షాదాబ్ చాలా ఏళ్లుగా ఇదే పని చేస్తున్నట్టు విచారణలో తెలిపాడు. గురువారం (నవంబర్ 25, 2021) నాడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను ఘజియాబాద్ రాజ్ ప్యాలెస్ ఫామ్ హౌస్ లో తీశారు. ఫామ్ హోమ్ మురాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, రౌలీ రోడ్‌లోని కాకడ కుగ్రామానికి సమీపంలో ఉంది. నిశ్చితార్థం లో భాగంగా మినారా మసీదు నివాసి షాదాబ్‌ను నాన్ కాల్చడానికి పిలిచారు. షాదాబ్ నాన్‌లో ఉమ్మి వేస్తుండడాన్ని ఒక వ్యక్తి చూసాడు. వెంటనే అతడిని ఎక్కడకూ వెళ్లనివ్వకుండా.. హిందూ యువ వాహిని సభ్యులు పోలీసులను పిలిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని షాదాబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. షాదాబ్‌పై ఎన్‌ఎస్‌ఏ కింద విచారణ జరిపించాలని హిందూ యువ వాహిని కోరింది. త్యాగి కుటుంబంలో నిశ్చితార్థం జరిగిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ కార్యక్రమంలో నేను కూడా ఉన్నాను.. షాదాబ్ పనితీరు గురించి తెలుసుకున్న వెంటనే నేను వీడియోను రూపొందించానని హిందూ వాహిని సభ్యుడు తెలిపారు. అరెస్టు చేసిన తర్వాత, అతను మొదట తాను ఆ పని చేశానని ఒప్పుకోలేదు.. అయితే అతను కొంతకాలంగా రొట్టెపై ఉమ్మివేస్తున్నట్లు తర్వాత అంగీకరించాడని తెలుస్తోంది. నిందితుడు షాదాబ్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 269 మరియు 270, అంటువ్యాధి చట్టంలోని సెక్షన్ 3/4 మరియు విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51 కింద అభియోగాలు మోపినట్లు పోలీసు అధికారి తెలిపారు. షాదాబ్ లాంటి వ్యక్తులు ఎన్నో ఏళ్లుగా భోజనంలో ఉమ్మివేస్తున్నారు. అయితే ఎందుకు అలా చేస్తున్నారో మాత్రం వివరణ ఇవ్వడం లేదని వీడియోను చూసిన పలువురు కామెంట్లు చేస్తున్నారు.