విమానంలో పొగలు.. 5వేల అడుగుల ఎత్తులో ప్రమాదం..!

0
719

స్పెస్​జెట్​ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. 5వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా.. క్యాబిన్​లో ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. ఫలితంగా జబల్​పూర్​కు వెళ్లాల్సిన ఆ విమానాన్ని తిరిగి ఢిల్లీకి తీసుకెళ్లారు.

విమానంలో పొగల కారణంగా.. జబల్​పూర్​ వెళ్లాల్సిన స్పైస్​జెట్​ విమానం.. శనివారం ఉదయం ఢిల్లీకి తిరిగివచ్చేసింది. 5వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు విమాన క్యాబిన్​లో పొగలను గుర్తించిన సిబ్బంది.. అప్రమత్తమై విమానాన్ని ఢిల్లీకి తీసుకొచ్చేశారు. “ఢిల్లీ నుంచి జబల్​పూర్​కు స్పైస్​జెట్​ విమానం వెళ్లాల్సి వచ్చింది. కానీ 5వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు క్యాబిన్​లో పొగలు వచ్చాయి. దానిని గుర్తించిన సిబ్బంది, విమానాన్ని ఢిల్లీకి తీసుకొచ్చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు,” అని స్పైస్​జెట్​ ప్రతినిధి ఒకరు మీడియాకు వివరించారు.

కాగా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. విమానంలో పొగలు అలుముకోవడం, వాటి మధ్య ప్రయాణికులు ఉండటం వీడియోలో కనిపిస్తోంది. ఓ స్పైస్​జెట్​ విమానం.. అత్యవసరంగా ల్యాండింగ్​ జరగడం.. గత 15రోజుల్లో ఇది రెండోసారి. జూన్​ 19న.. ఢిల్లీకి వెళ్లాల్సిన స్పైస్​జెట్​ విమానాన్ని గాలిలో ఓ పక్షి ఢీకొట్టింది. ఫలితంగా ఎడమ ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. విమానాన్ని పట్నాలో అత్యవసరంగా దింపాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here