More

    నేడు తిరుమల ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల

    తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేడు విడుదల చేయనుంది. గురువారం ఉదయం 10 గంటలకు దివ్యాంగుల దర్శనం కోటా టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకొనేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేస్తోంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాల్లోపు చంటి పిల్లల తల్లిదండ్రులకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి నెలా రెండు రోజులు వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది.

    తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఏటా కార్తీక మాసంలో టీటీడీ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. 9 రోజులపాటు జరగనున్నాయి. వివిధ వాహనాలపై పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుచానూరు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు కల్పవృక్ష వాహనంపై అమ్మవారు ఊరేగారు. శ్రీ రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మాఢ వీధుల్లో నృత్యాలు, కోలాటాల నడుమ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారికి సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు.

    Trending Stories

    Related Stories