National

ఓ వైపు మూడో వేవ్ భయం.. భారీ ర్యాలీలు చేపడుతున్న ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు

ప్రతి పక్షాలు ఎప్పుడు చూసినా ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడం లేదంటూ అనవసరమైన వాదనలను తెరపైకి తీసుకుని వస్తూ ఉంటాయి. అదే ప్రతి పక్షాలు మాత్రం పార్టీల కార్యక్రమాల విషయంలో పెద్ద ఎత్తున జనసమీకరణకు పాల్పడుతూ ఉంటాయి. కొన్ని మీడియా సంస్థలు కొన్ని పార్టీలకు తొత్తులుగా మారి.. విషయాన్ని బయటపెట్టవు. థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా భయంతో ఓ వైపు ఉంటే.. సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం భారీ ర్యాలీలను చేపడుతూ ఉన్నాయి.

కోవిడ్ -19 థర్డ్ వేవ్ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నా.. కాంగ్రెస్ మరియు సమాజ్‌వాదీ పార్టీ (SP) వంటి ప్రతిపక్ష పార్టీలు మాత్రం భారీగా ర్యాలీలను చేపడుతూ ఉన్నాయి. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ లలో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు భారీ ర్యాలీలు చేపట్టాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ దేశ రాజధానిలో భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కోవిడ్ నిర్వహణ లోపానికి కేంద్రంగా మారిన ఢిల్లీ లాంటి ప్రదేశంలో.. అది కూడా మొదటి మరియు రెండవ వేవ్ సమయంలో అక్కడి ప్రజలు కరోనాతో సతమతమయ్యారు. ఇప్పుడు కూడా ఆ ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కనిపించారు. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని వినడం కోసం పెద్ద ఎత్తున ప్రజలు ఆ ప్రాంతాల్లో చేరుకున్నారు.

బీజేపీ ఐటి సెల్ హెడ్ అమిత్ మాలవ్య రాహుల్ గాంధీ సభకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సభకు హాజరైన వాళ్లు కనీసం మాస్కులు కూడా ధరించలేదు.. చాలా మంది ప్రజలు ఒకరిపై ఒకరు పడిపోతున్నారు, రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి వేదికపైకి రావడం గమనించవచ్చు.

ఉత్తర ప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయ చట్టాలు, నేరాల వంటి సమస్యలపై పోరాటం అంటూ ‘సైకిల్ యాత్ర’ చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆయన తన సైకిల్ యాత్రను చేపట్టారు. ఈ ఈవెంట్ యొక్క వీడియోలో కూడా వేలాది మంది ఎస్పీ మద్దతుదారులు, కోవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘిస్తూ గుంపులు గుంపులుగా కనిపించారు. రాష్ట్ర రాజధాని వీధుల్లో కిక్కిరిసిన చాలా మంది అఖిలేష్ యాదవ్ మద్దతుదారులు మాస్కులు లేకుండా కనిపించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో పాటు, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గక ముందే వేలాది మంది పౌరుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా నిలిచే జర్నలిస్టు రోహిణి సింగ్ ఈ భారీ ర్యాలీకి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ప్రతి పక్షం ఉందా లేదా అని ప్రశ్నించే వారికి ఇదే సమాధానం అంటూ రోహిణి సింగ్ వీడియోను పోస్టు చేశారు.

రోహిణి సింగ్ తన ట్వీట్‌లో సమాజ్‌వాది పార్టీ విధేయులు మరియు మద్దతుదారులు కోవిడ్ ప్రోటోకాల్‌లను ఎలా నిర్లక్ష్యం చేశారో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ రెండు సంఘటనల చిత్రాలు మరియు వీడియోలు నెటిజన్లకు ఆగ్రహాన్ని తీసుకుని వచ్చాయి. వారు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధిపతి అఖిలేష్ యాదవ్ లపై తీవ్ర విమర్శలు చేశారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ కోవిడ్ ను కట్టడి చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన వీడియోలను.. ఇప్పుడు ఆయన సభలో మాట్లాడిన వీడియోలను కలిపి షేర్ చేస్తూ ఉన్నారు.


https://twitter.com/Shehzad_Ind/status/1423213873071464450

హిందువుల కుంభమేళాను కోవిడ్ ‘సూపర్ స్ప్రెడర్’ ఈవెంట్‌గా చిత్రీకరించడానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గతంలో చేసిన ప్రయత్నంకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. “వంచనకు ముఖం ఉంటే అది కనిపిస్తుంది ఇలా” అంటూ రాహుల్ గాంధీని విమర్శిస్తూ పలువురు ట్వీట్లు చేశారు. COVID-19 సంక్షోభాన్ని ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ఎంతగానో ప్రయత్నించారు కూడా..!

కాంగ్రెస్ టూల్‌కిట్‌లో ‘కార్నర్ నరేంద్ర మోదీ & కోవిడ్ మిస్‌ మేనేజ్‌మెంట్’, ‘కుంభమేళాను’ ‘సూపర్ స్ప్రెడర్’ లకు సంబంధించిన విషయం కూడా బయటకు వచ్చింది.

Related Articles

One Comment

  1. Hi there! I could have sworn I’ve visited this blog
    before but after going through many of the posts I realized it’s new to me.

    Anyhow, I’m definitely pleased I found it and I’ll be book-marking it and checking back frequently!

Leave a Reply

Your email address will not be published.

two × three =

Back to top button