More

    కేంద్రం నిధులు పక్కదారి పట్టిస్తున్నారు: ఎంపీ సోయం బాపురావు

    కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించారు. ఎంపీ సోయం బాపురావు అధ్యక్షతన జరిగిన దిశ సమీక్ష సమావేశం వాడివేడిగా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేసి, ప్రజలకు అవగాహన కలిపించడంలో అధికారులు విఫలం చెందారని ఆయన అన్నారు. ఐసీడీఎస్ పిడి మిల్కా పనీతీరును మార్చుకోవాలని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులను అధికారులు ఇతర పనులకు మళ్లిస్తూ ఆ నిధులను రాష్ట్రప్రభుత్వం అందిస్తున్నట్లు తెలియజేస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాకు వచ్చిన నిధులు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకొవాలని కోరారు. కేంద్రం ద్వారా మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, వ్యవసాయం, ఉపాధిహామీ తదితర పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకాల కింద వచ్చే నిధులు సద్వినియోగం చేసుకొని జిల్లా అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

    Trending Stories

    Related Stories