More

  దక్షిణాదిలో లెజెండరీ శకం ముగిసినట్టేనా..?

  సౌత్ ఇండియా సిని ఇండస్ట్రీలో తొలితరం దిగ్గజ కధానాయకుల శకం.. హీరో కృష్ణ మృతితో దాదాపు ముగిసింది. సినీ వినీలాకాశంలో తేజోమూర్తుల్లా విరాజిల్లిన తొలితరంలోని మలితరం కధానాయకుడు కృష్ణ నింగికేగిపోవడంతో, ఇక ఆ దశాబ్దాల కాలం నాటి సినీ వెలుగుజిలుగులు అంతరించినట్టయ్యింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నిఘంటువులా మారిన సూపర్ స్టార్ కృష్ణ.. తేనె మనసులతో సినీ ప్రస్థానం చేసి, తీయటి మనస్సునే అందరికి పంచి ఇచ్చారు. తెలుగు వెండి తెరకు సరికొత్త ఒరవడులు దిద్దిన సూపర్ స్టార్ కృష్ణ తొలి అనే పేరుకు వన్నె తెచ్చారు. దక్షిణ భారతావని తొలితరం, మలితరం హిరోల ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళ్లేముందు.. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‎పై క్లిక్ చేసి.. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.

  కేరళలో సుదీర్ఘకాలం పాటు మళయాళ సినీ సామ్రాజ్యాన్ని ఏలిన ప్రేమనజీర్.. చిత్రసీమలో ఆల్ టైం పాపులర్ నటుల్లో ఒకరిగా పరిగణింపబడ్డారు. నిత్య హరిత నాయకన్, ఎవర్ గ్రీన్ హీరోగా పేరొందిన.. ప్రేమ్ నజీర్ 1989 జనవరి 16న తనువు చాలించారు. కన్నడ కంఠీరవుడుగా.. కన్నడ సీని కళామతల్లి ముద్దుబిడ్డగా.. సుదీర్ఘకాలం సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో కన్నడ ఏకైక కథానాయకుడిగా నటించి మెప్పించి.. 2006 ఏప్రిల్ 12న తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

  మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ అంటే కొందరికే తెలియవచ్చు.. అయితే ఎం.జి.ఆర్ అంటే తమిళనాడు, తమిళ సిని రంగానికి ఆయన చేసిన సేవలు, తమిళనాట రాజకీయ రంగంలో ఆయన సాధించిన ఘన విజయాలు, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయన సేవలు ప్రతి ఒక్కరికి విదితమే. 1987 డిసెంబర్ 24 ఆయన కాన రాని లోకాలకు వెళ్లిపోయారు. ఎం.జి.ఆర్ రాజకీయ ప్రత్యార్థి.. తమిళనాడుకు సీఎంగా విశిష్ట సేవలు అందించిన మరో గొప్పవ్యక్తి కరుణానిధి. విచిత్రం..ఎంజీఆర్ సినీ హీరో కాగా, కరుణానిధి సినీ మహా రచయిత. ఎంజిఆర్ హీరోగా, కరుణానిధి మాటల రచయితగా వచ్చిన ఎన్నో తమిళ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. డాక్టర్ కళైజ్నర్ గా ప్రసిద్ది పొందిన ముత్తువేల్ కరుణానిధి 2018 ఆగస్ట్ 7 న కన్నుమూశారు. నడిగర తిలకం శివాజీ గణేశన్ నటనా సామర్ధ్యాన్ని ఇంత అని చెప్పడం ఎవరితరం కాదు. శిఖర సమానస్థాయిలో సాగిన ఆయన నటనావైభవానికి తమిళ సినీరంగం జేజేలు కొట్టింది. హిట్టుల మీద హిట్టులు ఇచ్చింది. 2001 జూలై 1న ఆ కంచుకంఠం మూగబోయింది.

  తెలుగు సినీ వినీలాకాశంలో నాగయ్యతరం హిరోల నుంచి ఆరంభమైన సినీ పరంపర అప్రతిహతంగా సాగింది. బహు పాత చిత్రాల కధానాయుడిగా బహుళ ప్రేక్షకాదరణ పొందిన నాగయ్య 1973 డిసెంబర్ 30న మృతి చెందారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లు మకుటం లేని మహరాజులుగా పేరొందితే కాంతారావు జానపద తిలకంగా పేరొందారు. తెలుగు సినీ నేత్రాలుగా ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లు పేరొందితే నుదుటి తిలకంగా కాంతారావు పేరొందారు.

  ఆ తరం తరంగాల్లోనే నూనూగు మీసాలతో, నవ యవ్వన సొబగులతో, నటనా వైశిష్ట్యంతో..తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించారు శోభన్ బాబు, కృష్ణ. దశబ్దాలుగా సాగిన వీరి సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, స్వల్పమాత్రం అపజయాలు చోటు చేసుకున్నాయి. సినీ రంగంలో, రాజకీయ రంగంలో గొప్ప పేరు పొందిన ఎన్టీ రామారావు..దాదాపు 400 సినిమాల్లో నటించారు. ఉమ్మడి ఏపీ సీఎంగా, టీడీపీ వ్యవస్థపాక అధ్యక్షుడిగా సేవలందించారు. ఈ నటరత్న మనోహరుడు 1996 జనవరి 18న గగనసీమను ఏలడానికి వెళ్లిపోయారు. తెలుగు సినిమా తొలినాళ్ల నాటి నుంచి మొన్నమొన్నటి వరకు..సుదీర్ఘకాలం పాటు సినీ కళామతల్లి సేవలో తరించిన మహోన్నత నటులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. ఆ నటసామ్రాట్టుడు…2014 జనవరి 22 న దివికేగిపోయారు.

  అందాల నటుడిగా, నవలా నాయకుడిగా పేరొందిన శోభన్ బాబు ఉదాత్త హీరోగా, కుటుంభ కధానాయుకుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్నారు. శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. వయస్సు మీద పడినా.. ఎప్పుడూ నిత్యనూతన యవ్వనంతో ఉండే ఈ సోగ్గాడు 2008 మార్చి 20న విగతజీవిగా మారిపోయారు. ఇంచుమించు ఆ తరానికే చెందినవారు కృష్ణంరాజు. చిన్నపాత్రలు, పెద్ద పాత్రల నుంచి..హిరో పాత్రలు, నిర్మాత పాత్రల వరకు..అన్నింటిని చేపట్టి..సినీ ఆణిముత్యంలా మెరిశారు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆ రెబల్ స్టార్..రెండంటే రెండే.. నెలల క్రితం..2022 సెప్టెంబర్ 11న కన్నుమూశారు.

  ఇప్పుడు నటశేఖరుడు అస్తమించాడు. తొలి జేమ్స్‌బాండ్ తెలుగు సినిమా గూఢచారి 116 లో కృష్ణ కధానాయకుడు. ఆయన తొలి పరంపర ఎలా సాగిందంటే.. మోసగాళ్ళకు మోసగాడు తొలి కౌబాయ్ సినిమా కాగా, అల్లూరి సీతారామరాజు తొలి ఫుల్‌స్కోప్ సినిమా. ఇక, తొలి 70 ఎంఎం సినిమాగా సింహాసనం రికార్డు కెక్కింది. సాహస హీరోగా, సినీ సమాజ హితుడుగా, అభిమానుల ఆరాధకుడిగా, ప్రేక్షకుల పెన్నిధిగా కృష్ణ పేరు ప్రతిష్ఠలు పొందారు. కష్టాన్ని ఇష్టంగా చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించిన కృష్ణ, రోజుకి మూడు షిప్ట్ లూ పనిచేసిన రోజులు ఉన్నాయిట. ఏడాదికి 10 సినిమాలను పూర్తి చేసిన ఘనుడిని నేనే అని ఘటమనేని నిరూపించుకున్నారు. ఒకే ఏడాది 17 సినిమాల్లో హీరోగా నటించి ప్రపంచ రికార్డు సాధించారు. ఈ అసాధ్యం 1972 లో ఆయనకు సుసాధ్యం అయ్యింది. ఆ అగ్రగణ్య నట శేఖరునికి అశేష అభిమానగణం, ప్రేక్షక జనం..అశృనివాళి సమర్పించింది.

  Trending Stories

  Related Stories