టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. భారత జట్టులో మార్పులు ఇవే

0
713

భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య వ‌న్డే సిరీస్‌ నేడు మొదలైంది. మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా బుధ‌వారం పార్ల్ వేదిక‌గా తొలి వ‌న్డేలో ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. టెస్టు సిరీస్ విజ‌యంతో సౌతాఫ్రికా బ‌రిలోకి దిగుతుండ‌గా.. వ‌న్డే సిరీస్‌ను గెలవాలనే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో టీమ్ఇండియా ఉంది. ఇక కెప్టెన్సీ వ‌దులుకున్న త‌రువాత విరాట్ కోహ్లీ ఆడుతున్న తొలి మ్యాచ్ కావ‌డంతో అందరి చూపూ కోహ్లీ పైనే ఉంది. ఈ మ్యాచ్ లో భారతజట్టుకు కెఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. రోహిత్ శ‌ర్మ గాయంతో సౌతాఫ్రికా సిరీస్‌కు దూరం కావ‌డంతో రాహుల్ కెప్టెన్సీ గురించి చర్చ జరగనుంది. రాహుల్‌తో క‌లిసి శిఖ‌ర్ ధావ‌న్ ఓపెనింగ్ చేయనుండగా.. కోహ్లీ వన్ డౌన్ లో రానున్నాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. వెంకటేష్ అయ్యర్ తన తొలి వన్డే మ్యాచ్ ఆడబోతున్నట్లు రాహుల్ తెలిపాడు. శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగనున్నాడు.

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), జాన్నెమన్ మలన్, ఐడెన్ మార్క్‌రామ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, టెంబా బావుమా(సి), డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, లుంగీ ఎన్‌గిడి

భారత్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(c), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(w), వెంకటేష్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్