సౌరవ్ గంగూలీ ట్వీట్ వైరల్.. ఏమి చెప్పబోతున్నారోననే ఉత్కంఠ

0
1033

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం (జూన్ 1)న గంగూలీ చేసిన ట్వీట్ కారణంగా ఇప్పుడు మీడియాలో తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. ‘నేను కొత్త జీవితం ప్రారంభించేదుకు ప్రణాళికలు వేస్తున్నాను. నా నిర్ణయం ద్వారా మరింత ఎక్కువ మందికి ప్రయోజనం అందుతుందని భావిస్తున్నా’ అని గంగూలీ ట్వీట్ చేశారు. దీంతో ఆయన రాజకీయాల్లో చేరతారనే వార్తలు ప్రచారమవుతూ ఉన్నాయి. ఇటీవలి కాలంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్‌షాతో గంగూలీ రెండుసార్లు భేటీ అవడంతో.. త్వరలోనే ఆయన బీజేపీ తరఫున పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. గంగూలీ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలయాలంటే మాత్రం ఎదురుచూడక తప్పదు.