సోనూ సూద్ ను చూసి కూడా ఓట్లు వేయలేదు

0
695

పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బకు పెద్ద పెద్ద నాయకులే ఓటమి పాలయ్యారు. ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ ఓడిపోయారు. మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ అరోరా చేతిలో పరాజయం పొందారు. అమన్ దీప్ కు 58,813 ఓట్లు రాగా, మాళవికకు 38,125 ఓట్లు వచ్చాయి. పంజాబ్‌లోని మోగా నియోజకవర్గంలో బాలీవుడ్ స్టార్ సోనూసూద్ మ్యాజిక్ చేయడంలో విఫలమయ్యారని విమర్శలు చేశారు. ఆమె మోగా నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్జోత్ కమల్ సింగ్ స్థానంలో పోటీకి దిగారు. హర్జోత్ కమల్ సింగ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లోకి మారగా ఆమెకు 10,606 ఓట్లు వచ్చాయి.

మాళవిక మోగా జిల్లాలో ఒక ప్రముఖ సామాజిక కార్యకర్త, ప్రధానంగా విద్య మరియు ఆరోగ్య రంగాలలో పనిచేశారు. ఆమె పట్టణంలో ఒక మాధ్యమిక పాఠశాలతో పాటు IELTS ఆంగ్ల భాషా పరీక్ష కోసం కోచింగ్ క్లాస్‌ను నడుపుతోంది. ఆమె అభ్యర్థిత్వం తన సోదరుడి స్టార్ డమ్ నీడలో ఉండిపోయింది, రాజకీయ వర్గాల్లో చాలా మంది ఆమెను ‘డమ్మీ అభ్యర్థి’ అని ఆరోపిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ తనకు పదవులు ఆఫర్ చేసిందని సోనూ సూద్ గతంలో మీడియాతో చెప్పారు, అయితే మోగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నందున వాటిని తిరస్కరించారు. మాళవిక కాంగ్రెస్ పార్టీలో చేరింది. అయితే ఆమెకు ఓటమి ఎదురైంది.

సోనూ సూద్ మాళవిక ప్రచారానికి ‘స్టార్ క్యాంపెయినర్’ గా వ్యవహరించాడు. తన సోదరి రాజకీయాల్లోకి రావడాన్ని ప్రోత్సహించాడు సోనూ సూద్. మాళవిక రాజకీయాల్లోకి రాలేదు, ఆమెను తీసుకువచ్చారని సోనూ జనవరిలో ప్రచారం చేస్తున్నప్పుడు అన్నాడు. మాళవిక ఎన్నికల్లో ‘మాళవిక సూద్ సచార్‌’ గా కాకుండా తన మొదటి పేరు ‘మాళవిక సూద్‌’పై ఎన్నికలలో పోటీ చేసింది. ప్రచార సమయంలో, సోనూ తన ప్రసంగాలలో మోగా ఓటర్లకు తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను గుర్తు చేశాడు,. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్జోత్ సింగ్ తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమయ్యారని మాళవిక ప్రచారం చేయడం కనిపించింది. తనను గెలిపిస్తే ఎంతో గొప్పగా పని చేస్తానని మాళవిక చెప్పింది. అయినా ఓటర్లు ఆమె మాటలను నమ్మలేదు.