More

  సోనూసూద్ మరో గొప్ప సాయం..! చిన్నారి మొఖంలో చిరునవ్వు..!!

  బాలీవుడ్, టాలీవుడ్ నటుడు సోనూ సూద్ చేసే సామాజిక సేవ గురించి ఎక్కువ మందికి తెలుసు. ఆపన్నులను ఆదుకోవడంలో ఆయన ఎప్పుడూ వెనుకాడింది లేదు. తాజాగా ఆయన చేసిన సాయంతో ఓ బాలిక సాధారణ జీవితం గడిపేందుకు మార్గం ఏర్పడింది.

  లాక్ డౌన్ ఆద్యంతం కరోనాలో తన సహాయం అవసరమైన వారందరికీ అండగా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురిని ఆపదలో ఆదుకున్నాడు. సోనూ భాయ్ ఇప్పటికీ తన సేవల్ని కొనసాగిస్తున్నాడు. తనకు బంగారు హృదయం ఉందని మరోసారి నిరూపించుకున్నాడు. ఈసారి అతను బీహార్ లోని ఒక చిన్నారికి కొత్త జీవితాన్ని తీసుకురావడానికి సహాయం చేశాడు.

  చాలా మంది పిల్లలు జన్యులోపం కారణంగానో లేక మరే ఇతర కారణాల వల్లనో శరీరంలో ఏదో ఒక అవయవం గాని,లేదా నడుం భాగం నుంచి అతుక్కుని పుట్టిన వాళ్ళని చూశాం. కానీ ఇక్కడ ఒక అమ్మాయి మాత్రం చాలా విచిత్రంగా జన్మించింది. బీహార్ లోని నెవాడా జిల్లాకు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించింది. ఆ చిన్నారి కుటుంబం వైద్యం చేయించే స్తోమత లేని పేద కుటుంబం.

  అయితే ఆ చిన్నారికి చేతులు, కాళ్ళు ఆమె పొట్ట భాగానికి అనుసంధానమై ఉన్నాయి. ఈ మేరకు ఆ చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ ఆ చిన్నారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అంతే కాదు ఆ చిన్నారికి వైద్యం అందుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా.. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అని ట్వీట్ చేశారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో బాలికను వైద్యులు డిశ్చార్జ్ చేయనున్నారు.

  ఈ పోస్ట్ ని షేర్ చేయగానే.. సోనూ పరిశ్రమ స్నేహితులు అభిమానుల నుండి గొప్ప ప్రేమ కురిసింది. సునీల్ శెట్టి- ఈషా గుప్తా- రిధిమా పండిట్ సహా సహ నటీనటులు కామెంట్ సెక్షన్ లో హార్ట్ ఎమోజీలతో ప్రశంసించారు. పూజా బాత్రా కూడా చాలా అద్భుతం అని రాశారు. ఓనూ అభిమానులలో ఒకరు భూమిపై ఉత్తమ వ్యక్తి అని రాశారు. మరొకరు బాలీవుడ్ లో మీరు ఉత్తముడు అని వ్యాఖ్యానించారు. వేరొకరు గరీబో కా మెస్సియా అని వ్యాఖ్యానించారు. సోనూసూద్ టాలీవుడ్ బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్. అంతకుమించి మానవతను చాటుకుంటూ అందరివాడు అయ్యాడు.

  Trending Stories

  Related Stories