National

మరోసారి కరోనా బారిన పడిన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌కు ముందు క‌రోనా బారిన ప‌డిన సోనియా గాంధీ కొన్ని రోజుల పాటు ఆసుప‌త్రిలో ఉన్నారు. క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్న త‌ర్వాతే ఆమె ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా శ‌నివారం మ‌రోమారు సోనియా కరోనా బారిన పడ్డారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. సోనియా గాంధీలో మరోసారి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోగా ఆమెకు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె త‌న ఇంటిలోనే ఐసోలేష‌న్‌లోకి వెళ్లిపోయారు. “Congress President Smt.Sonia Gandhi has tested positive for Covid-19 today. She will remain in isolation as per Govt. protocol.” అని జైరాం రమేష్ ట్వీట్ చేశారు.

Related Articles

Back to top button