కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని ఆ పార్టీ నేత రణదీప్ సూర్జేవాలా గురువారం తెలిపారు. “ఆమెకు తేలికపాటి జ్వరం, కొన్ని కోవిడ్ లక్షణాలు ఉన్నాయి. ఆమె ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. అవసరమైన వైద్య సహాయం అందించబడింది.” అని చెప్పుకొచ్చారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని జూన్ 8న ఏజెన్సీ ముందు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 8న ED ముందు సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం అలాగే ఉందని సుర్జేవాలా స్పష్టం చేశారు.