More

    ఐదు రాష్ట్రాలలోని పార్టీ చీఫ్ లను తొలగించిన సోనియా గాంధీ

    కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఐదు రాష్ట్రాలలోని పార్టీ చీఫ్ లను తొలగించారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ భారీ ఓటమిని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నిక‌లు ముగిసిన 5 రాష్ట్రాలు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, గోవా, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌ల‌కు చెందిన పార్టీ శాఖ‌ల చీఫ్‌లు (పీసీసీ) త‌క్ష‌ణ‌మే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయాల‌ని సోనియా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్నిక‌లు ముగిసిన 5 రాష్ట్రాల రాష్ట్ర శాఖ‌ల‌ను పున‌ర్వ్యవ‌స్థీక‌రించాల్సి ఉన్నందున పీసీసీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయాల‌ని ఆమె ఆదేశించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం పార్టీ అధికార ప్ర‌తినిధి ర‌ణ‌దీప్ సూర్జేవాలా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇది “పునర్వ్యవస్థీకరణ” దిశగా మొదటి అడుగు అని కాంగ్రెస్ భావిస్తోంది. ఎనిమిది నెలల క్రితం పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయాలని సూచించారు. రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ల పునర్వ్యవస్థీకరణను సులభతరం చేసేందుకే రాజీనామాలు కోరినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు.

    కాంగ్రెస్ పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చేతిలో ఓడిపోయింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైంది. అంతేకాకుండా BJPకి గట్టి పోటీని కూడా ఇవ్వలేకపోయింది. పంజాబ్ ఓటమి అత్యంత ఘోరమైనదిగా కాంగ్రెస్ భావిస్తోంది. ఆ రాష్ట్రంలో నెలల తరబడి అంతర్గత పోరు తర్వాత కాంగ్రెస్ కూలిపోయింది. తాజా ఎన్నికల పరాజయాలపై చర్చించేందుకు ఆదివారం జరిగిన కాంగ్రెస్ నాయకత్వ సమావేశానికి కొనసాగింపుగా సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

    Trending Stories

    Related Stories