కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తల్లి పాలోవా మయానో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మరణించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ తల్లి పాలోవా మయానో ఈ నెల 27న (శనివారం) మృతి చెందినట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మీడియాకు తెలిపారు. శనివారం మరణించిన పాలోవా మయానో అంత్యక్రియలు మంగళవారం (ఆగస్టు 30)న ముగిసినట్లు తెలిపారు.
‘Smt. Sonia Gandhi’s mother, Mrs. Paola Maino passed away at her home in Italy on Saturday the 27th August, 2022. The funeral took place yesterday.’ అంటూ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. వైద్య చికిత్సల నిమిత్తం విదేశీ పర్యటనకు సోనియా వెళ్లనున్నారన్న సంగతి తెలిసిందే..! తన పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలతో కలిసి వెళ్లాలని అనుకున్నారు. ఇంతలోనే ఈ వార్త వారి కుటుంబానికి తెలిసింది.