National

ఈడీ ముందుకు సోనియాగాంధీ.. మొదటి రోజు ప్రశ్నలు ఇవే..!

నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఆమెను అధికారులు విచారించారు. మధ్యాహ్న భోజనానికి విరామం ఇవ్వడంతో సోనియా ఈడీ కార్యాలయం నుంచి తన నివాసానికి వెళ్లిపోయారు.

భోజనం అనంతరం మరోసారి ఈడీ అధికారులు సోనియాను విచారించనున్నారు. సోనియా వెంట ప్రియాంకా గాంధీ, వైద్యుల బృందం ఉన్నది. అయితే ఆమె కుమారుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వెంట ఈడీ కార్యాలయాన్ని వచ్చారు. అనంతరం విచారణ గదిలోకి సోనియా గాంధీ వెళ్లారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోనియా గాంధీకి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వెంట కుమార్తె ఉండేందుకు అధికారులు అనుమతించారు. ఇటీవల ఆమె కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్నారు. మరోవైపు ఈ కేసులో సోనియాను ఈడీ విచారించడం ఇదే తొలిసారి. అదనపు డైరెక్టర్ స్థాయి మహిళా అధికారి ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఇటీవల ఇదే కేసులో రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించారు.

దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఢిల్లీలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌లు చేస్తున్నారు. దీంతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. ఆ పార్టీకి చెందిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బెంగళూరులోని ఈడీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఆందోళనకారులు కారుకు నిప్పు పెట్టారు. కార్యకర్తలపై వాటర్ కెనన్‌లు ప్రయోగించారు. 75 మందిని అదుపులోకి తీసుకున్నారు. అసోంలోను కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన నిర్వహించగా.. కాంగ్రెస్‌ శ్రేణులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నది. ఈడీ విచారణ తీరుపై కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున మండిపడ్డారు. 65 ఏళ్లుపైబడిన వారి ఇండ్లకు వెళ్లి అధికారులే విచారిస్తారని.. కానీ, ఇక్కడ అలా జరగడం లేదని విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

four + one =

Back to top button