ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సోమువీర్రాజు బహిరంగ లేఖ

0
928

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో ధాన్యానికి కనీస మద్దతుధర లేదని ఆరోపించారు. ధాన్యానికి మద్దతు ధర లేదని.. మిల్లర్లు అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా రైతు చాలా నష్టపోతున్నారని ఆరోపించారు. ఇదే విషయం నేను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనేక వేదికల మీద చెబుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. రైతులకి చెందాల్సిన డబ్బును నొక్కేస్తున్న అధికారులు, మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు అన్నారు. తూర్పు,పశ్చిమ, సెంట్రల్ డెల్టాల్లో లక్షలాది ఎకరాల్లో వరి పండించిన రైతులకు కోట్లు రూపాయలు కుచ్చుటోపి పెడుతున్న ధాన్యం మాఫియా పై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నానన్నారు.

తాజాగా రాజ్యసభ సభ్యులు పిల్లిసుభాష్ చంద్రబోస్ ఈ క్రాప్ నమోదులోనే కుంభకోణం జరుగుతోందని అన్నారని.. ప్రభుత్వం కనీసం సొంత పార్టీ ఎంపి మాటలనైనా పరిగణలోకి తీసుకోవాలని హితవు పలికారు. ధాన్యం కొనేది మిల్లర్లు గణాంకాలు లెక్కించేది ఆర్ బికె సెంటర్లు అని..అందరూ కలిసి రైతుల సొమ్ముమింగేస్తున్నారని ఆరోపించారు. ఈ దర్జా దోపిడి వెనుక ఎవరు ఉన్నారన్నది దర్యాప్తు సంస్ధలు తేల్చాలని అన్నారు. ఈ విషయం తేలాలి అంటే ముఖ్యమంత్రి గారు నోరు మెదపాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు. కష్టాల కడలిలో ఉన్న రైతును ధాన్యం నాణ్యత పేరుతో అన్యాయం చేస్తున్నారని.. దోపిడీ రాజ్యమేలుతోందని అన్నారు. ముఖ్యమంత్రి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. .కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు పక్కాగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు సోము వీర్రాజు.