More

    ఎస్సీ బస్తీల్లో సంపర్క్ అభియాన్: సోము వీర్రాజు

    రాష్ట్రంలోని ఎన్నో అభిృద్ది పనులకు కేంద్రప్రభుత్వం నిధులు ఇచ్చిందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇంకా ఎన్నో పథకాలకు నిధులు ఇచ్చిందని, అవన్నీ పూర్తయ్యాయని అన్నారు. వాటిని ప్రధాని మోదీ దేశానికి అంకితం చేస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏ అభివృద్ధీ లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వం విపక్షాల మీద అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఏపీలోని 5వేల ఎస్సీ బస్తీల్లో సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కడప జిల్లాలోని ఎస్సీలు ఈ అభియాన్‎కు తరలివస్తే అధికార పార్టీ అడ్డుకుంటోందని, దీనిపై తాము పోరాడుతామన్నారు.

    Trending Stories

    Related Stories