More

    పవన్ కల్యాణ్‎కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోదు: సోము వీర్రాజు

    పవన్ కళ్యాణ్‎కు హాని తలపడితే బీజేపీ చూస్తు ఊరుకోదని ఆ పార్టీ ఏపీ అధ్యక్ష్యుడు సోము వీర్రాజు హెచ్చరించారు. కడప జిల్లా పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఇంటివద్దకు వచ్చిన అపరిచిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ పర్యటన విషయంలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు విశాఖ ప్రధాని పర్యటన విషయంలో విజయసాయి ప్రకటనలు ప్రజలను తికమక పెడుతున్నాయని ఆరోపించారు. ప్రధాని అధికారిక పర్యటన వివరాలు ఛీఫ్ సెక్రటరీ వివరిస్తారని అయినా పర్యటన వివరాలను వెల్లడించడానికి విజయసాయి ఎవరని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం గాలేరీ నగరి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడంలేదని నిలదీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రైల్వే విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలకు కేంద్రం నిధులు మంజూరు చేస్తే వాటిని ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ఆయన కుటుంబ పార్టీలు ఏమి చేస్తున్నాయని సూటిగా ప్రశ్నించారు.

    Trending Stories

    Related Stories