ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుంది: సోము వీర్రాజు

0
844

ఏపీలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. నెల్లూరులో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. అమరావతిలోనే రాష్ట్ర రాజధాని ఉండాలని, బెంగళూరు నుంచి అమరావతికి ఆరు వరుసల రహదారిని కూడా కేంద్రం మంజూరు చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మమకారం లేదని, ఎన్నికల అంశంగా మారుస్తోందని ఆయన దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అమరావతినే రాజధాని అని ఇండియా మ్యాప్‎లో కూడా పెట్టిందని అన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

12 + 16 =