కేసీఆర్‎కు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు: సోము వీర్రాజు

0
787

ఆంధ్రులను పాలేగాళ్ళు, ద్రోహులుగా వర్ణించిన కేసీఆర్‎కు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హతే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ జాతీయస్థాయిలో కొత్త పార్టీ పెట్టడం వల్ల ఒరిగేదేమి లేదన్నారు. అసలు ఈ పార్టీ పెట్టె హక్కు కేసీఆర్‎కు లేదని, స్వార్థపూరిత వ్యక్తి కేసీఆర్ అని, అలాంటి నేత జాతీయ పార్టీ ఎలా పెడతారని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ అధినేతపై కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని, ఆయనకు ఏమాత్రం అవగాహన లేదని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుందన్నారు. కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‎లో చిక్కుకుందని, ఆ టాపిక్‎ని డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ పార్టీ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. తెలంగాణా లో టీఆర్ ఎస్ ఓటమి పాలు కానుందని, ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సి ఉంటుందని సోము వీర్రాజు జ్యోస్యం చెప్పారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

2 × 3 =