More

    బీసీ మంత్రులకు స్వేచ్చలేదు: సోమువీర్రాజు

    వైఎస్ఆర్సీపీ, టీడీపీలు బీసీలకు తమలపాకులు, అగ్రవర్ణాలకు తాంబూలాలు ఇచ్చారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. రాష్ట్రంలో బీసీలకు, ఎస్సీలకు పదవులు ఇచ్చారు కానీ పవర్ ఇవ్వలేదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రొంగల గోపీ శ్రీనివాస్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యవర్గ సమావేశానికి సోము వీర్రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ప్రారంభ సమావేశంలో సోమువీర్రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ రాష్ట్రంలో మైండ్ గేమ్ పాలిటిక్స్ నడుపుతుందన్న ఆయన.. నడిరోడ్డుపై రైతులు రాజధాని కోసం నడుస్తుంటే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు వ్యక్తిత్వం లేదని… సీఎం ఇచ్చిన స్క్రిప్ట్ మంత్రులు, ఎమ్మెల్యేలు చదువుతున్నారని విమర్శించారు. ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పార్ధసారధి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం, ఓబీసీ మోర్చా నేతలు పట్నాయక్, వీరాంజనేయులు తదితరులు కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు.

    Trending Stories

    Related Stories