More

    కన్నా చేసిన విమర్శలపై స్పందించిన సోము వీర్రాజు

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసలు పార్టీలో ఏం జరుగుతుందో తమకు తెలియడం లేదన్నారు కన్నా లక్ష్మీనారాయణ. సోము ఒక్కడే అన్నీ చూసుకోవడం వల్లే సమస్యలని.. పవన్ కళ్యాణ్‌తో సోము వీర్రాజు సమన్వయం చేసుకోలేకపోయారని అన్నారు. జనసేనానితో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. ఏపీలో పార్టీ బలోపేతానికి అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ ఏడాది పాలన చూసి తాను బీజేపీ పోరాడాల్సిన అవసరం ఉందని తాను చెప్పానని.. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్షాలు ఏకం కావాలన్నారు. పొత్తులో ఉన్న జనసేన పార్టీతో బీజేపీ సమన్వయం చేయలేకపోయిందని అన్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి నడవడంలో ఢిల్లీ నాయకత్వం మాట్లాడి సరి చేస్తుందని భావిస్తున్నానన్నారు.

    కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అధ్కక్షులు సోము వీర్రాజు స్పందించారు. తమ పార్టీలో ఆయన పెద్దలని, ఆయన వ్యాఖ్యలపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని సోము వీర్రాజు తెలిపారు. ఆయన అన్న సందర్భం ఏమిటో తనకు తెలియదన్నారు. ఆయనేదో అన్నారని తాను అన్నింటికీ స్పందించబోనని సోము వీర్రాజు తెలిపారు.

    Trending Stories

    Related Stories