More

    అక్రమ అరెస్టులపై జనసేనతో కలిసి పోరాడేందుకు బీజేపీ సిద్ధం

    జనసేన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంపై బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. జనసేన నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడాన్ని ఏపీ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఈ కేసులను తక్షణమే ఎత్తివేయాలని, జనసేన నేతలు, కార్యకర్తలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోకుంటే జనసేనతో కలిసి ప్రతిఘటించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

    దాడిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనతో తమకు ఎంత మాత్రం సంబంధం లేదని పవన్ తెలిపారు. తాను విశాఖలో అడుగుపెట్టడానికి ముందే ఈ ఘటన జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పవన్ కు పోలీసులు నోటీసులు అందించారు. విశాఖ చేరాక తాను రెచ్చగొట్టడం వల్లే గొడవ జరిగినట్లుగా నోటీసుల్లో పేర్కొన్నారని, అందులో వాస్తవం లేదని పవన్ పేర్కొన్నారు. దాడితో తమకు ఎంతమాత్రం సంబంధం లేదని వివరణ ఇచ్చారు.

    Trending Stories

    Related Stories