మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడం హాస్యాస్పదమని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. అమరావతికి రైతులు భూములిస్తే విశాఖపట్నంలో భూములు దోచుకునేందుకు రాజధాని కట్టాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందన్నారు. వైఎస్.జగన్ ప్రభుత్వం కారణంగా ఎన్నో కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ఆరోపించారు. అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే అప్పట్లో ప్రతిపక్షనేత హోదాలో జగన్ అంగీకరించాడని, ఇప్పుడు మూడు రాజధానులంటూ మాట మార్చాడని సోమిరెడ్డి విమర్శించారు. దేశంలో జగన్ కారణంగా ఆంధ్రరాష్ట్రం పరువుపోతోందన్నారు. ఈ ప్రభుత్వానికి కోర్టులన్నా… రాజ్యంగమన్నా గౌరవం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జోకర్ల కన్నా హీనమని ఆయన విమర్శించారు. మంత్రి రోజాతో మాట్లాడి జగన్ కేబినెట్ మొత్తం జబర్దస్త్ కిట్స్ చేసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు.