More

    కరెంట్ వైర్లలో ఇరుక్కుపోయిన విమానం

    అమెరికా లోని మేరీల్యాండ్ లో విమానం కరెంట్ వైర్లతో ఇరుక్కుపోవడంతో చాలా ప్రాంతాల్లో కరెంటు కోత ఎదురైంది. మేరీల్యాండ్‌ రాష్ట్రంలో ఒక చిన్న విమానం విద్యుత్ లైన్‌లపైకి కూలిపోవడంతో మోంట్‌గోమెరీ కౌంటీలో విద్యుత్తు అంతరాయం ఏర్పడిందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కౌంటీ అంతటా బ్లాక్‌అవుట్ కారణంగా 90,000 ఇళ్లకు కరెంట్ సప్లై ఆగిపోయింది. పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి.

    “రోత్‌బరీ డాక్టర్ & గోషెన్ ఆర్డి ప్రాంతంలో ఒక చిన్న విమానం విద్యుత్ లైన్‌లపైకి దూసుకెళ్లింది, దీంతో కౌంటీలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దయచేసి లైవ్ వైర్లు ఉన్నందున విమానాలను నడిపే వ్యక్తులు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలి” అని మోంట్‌గోమెరీ కౌంటీ పోలీసులు ట్విట్టర్ లో తెలిపారు. వర్షం పడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే అసలు కారణం ఇంకా తెలియరాలేదు. విమానం 10వ అంతస్తు ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లను ఢీకొట్టి ఉండవచ్చని అంచనా వేశారు అధికారులు.

    Trending Stories

    Related Stories