More

    సూర్య రెండో సెంచరీ.. దుమ్ము దులిపాడు

    న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టీ 20లో సూర్య‌కుమార్ చెలరేగాడు. సెంచ‌రీ కొట్టడంతో భారత జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. సూర్య‌కుమార్ 111 స్కోర్‌తో నాటౌట్‌గా నిలిచాడు. హాఫ్ సెంచ‌రీకి 32 బంతులు తీసుకున్న సూర్య ఆ త‌ర్వాత మరింత దూకుడుగా ఆడాడు. మరో 17 బంతులో 50 ప‌రుగులు చేసి, సెంచ‌రీ మార్క్ అందుకున్నాడు. సూర్య మొత్తంగా 51 బంతుల్లోనే 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేశాడు.

    టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 191/6 స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్స్ తో 36) కూడా రాణించాడు. మరో ఓపెనర్ రిషబ్ పంత్ 13 బంతులు ఆడి ఆరు పరుగులకే ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (13) హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. 6.4 ఓవర్లలో భారత్ 50/1 స్కోరు ఉన్న సమయంలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. తిరిగి మొదలైన తర్వాత సూర్యకుమార్ చెలరేగిపోయాడు. చివరి ఓవర్లో పాండ్యా, దీపక్ హుడా, సుందర్ లను ఔట్ చేసిన టిమ్ సౌథీ హ్యాట్రిక్ సాధించాడు. జులైలో ఇంగ్లండ్ పై సూర్యకుమార్ తొలి శతకం సాధించాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తర్వాత ఈ ఫార్మాట్ లో రెండు, అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన భారత క్రికెటర్ గా నిలిచాడు. రోహిత్ ఖాతాలో నాలుగు శతకాలు ఉండగా.. కేఎల్ రాహుల్ రెండు సాధించాడు.

    Trending Stories

    Related Stories