సొంత యాప్ లో ఐపీఎల్ మ్యాచ్ ను టెలికాస్ట్ చేశాడు.. ఆ తర్వాత

0
849

ఐపీఎల్ క్రికెట్‌ మ్యాచ్ లను ఉచితంగా చూసేందుకు కొత్త యాప్‌ను రూపొందించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన స్టార్ స్పోర్ట్స్ టీవీ ఎగ్జిక్యూటివ్ కదరామ్ తుప్పా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు స్టార్ స్పోర్ట్స్ లింక్‌ను దొంగిలించారని, ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేస్తున్నారని తెలిపారు. దీంతో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ పని చేస్తోంది తమిళనాడులోని శివగంగై జిల్లా కంజిరంగల్‌ గ్రామానికి చెందిన రామమూర్తి (29)గా గుర్తించారు. ఐపీఎల్ సిరీస్‌ను ఉచితంగా చూసేందుకు వీలుగా వేరే యాప్‌ను రూపొందించాడు. కొన్ని సంస్థల ప్రకటనలను కూడా ప్రసారం చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు రామమూర్తిని అదుపులోకి తీసుకుని శివగంగై మొదటి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.

స్టార్ స్పోర్ట్స్‌ టీవీ ప్రతినిధి కదరామ్ తుప్పా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు.. నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో ఆ యాప్‌ను తమిళనాడులోని శివగంగై జిల్లా నుంచి నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం తమిళనాడు వెళ్లిన పోలీసులు శివగంగై సమీపంలోని కాంజిరంగల్‌లోని పిల్లైయార్ కోయిల్ వీధిలో ఉంటున్న రామమూర్తిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఐపీఎల్‌ 2022 సీజన్‌ టీవీ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్‌ దక్కించుకున్న విషయం​ తెలిసిందే. ఇందుకోసం ఆ ఛానల్‌ బీసీసీఐతో 16,347 కోట్లకు డీల్‌ కుదుర్చుకుంది.

ఇప్పుడే వ్యూస్ బాగా తగ్గాయని స్టార్ స్పోర్ట్స్ ఛానల్ సిబ్బంది తలలు పట్టుకుంటూ ఉండగా.. ఇలాంటి లింక్స్, యాప్స్ చాలా నష్టాన్ని చేకూరుస్తూ ఉన్నాయి.