More

    సింగర్ మంగ్లీ కారుపై నిజంగానే రాళ్ల దాడి జరిగిందా..? మంగ్లీ మాటల్లోనే..!

    ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారుపై కర్ణాటకలో రాళ్ల దాడి జరిగిందనే కథనాలు మీడియాలో వచ్చాయి. బళ్లారి నగరంలో మున్సిపల్ కాలేజి మైదానంలో బళ్లారి ఉత్సవ్ పేరిట వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. బళ్లారి ఉత్సవ్ వేడుకల్లో గాయని మంగ్లీ తన పాటలతో అలరించారు. ఈ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా బళ్లారిలో ఆమె కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారని.. ఈ దాడిలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్టు వార్తలు వచ్చాయి.

    అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని మంగ్లీ తెలిపింది. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆ తప్పుడు వార్తలను తాను ఖండిస్తున్నానని అన్నారు మంగ్లీ. బళ్లారిలో జరిగిన ఈవెంట్‌లో నాపై దాడి జరిగిందని సోషల్ మీడియా గ్రూపుల్లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు. ఈ వార్తలను నేను ఖండిస్తున్నానని అన్నారు. నేను పాల్గొన్న మంచి ఈవెంట్లలో ఇదీ ఒకటి. కన్నడ ప్రజలు నా మీద కురిపించిన ప్రేమ, ప్రోత్సాహానికి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అధికారులు, నిర్వాహకులు నన్నెంతో జాగ్రత్తగా చూసుకున్నారని అన్నారు. నా ప్రతిష్టకు భంగం కలిగించడానికే ఇలాంటివన్నీ చేస్తున్నారు.. ఈ రకమైన తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నానని మంగ్లీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

    Trending Stories

    Related Stories