More

    సింగపూర్ ఓపెన్ ఫైనల్ చేరిన సింధు

    సింగపూర్ ఓపెన్ లో పీపీ సింధు సత్తా చాటింది. జపాన్ షట్లర్ సయేనా కవాకమిని చిత్తు చేసి ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. దాదాపు అరగంట పాటు కొనసాగిన మ్యాచ్ లో 21-15, 21-7 తేడాతో సింధు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కవాకమిపై సింధు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెండు సార్లు ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధు క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన హాన్ యూను చిత్తు చేసింది. సింగపూర్ ఓపెన్ ను సొంతం చేసుకోవడానికి సింధు మరో అడుగు దూరంలో ఉంది.

    ప్రపంచ నంబర్ 7 సింధు 20-15 వద్ద ఐదు గేమ్ పాయింట్ల అవకాశాన్ని వినియోగించి మొదటి గేమ్‌ను 21-15తో కైవసం చేసుకుంది. రెండవ గేమ్‌లో, ఆమె మొదటి నాలుగు పాయింట్లను త్వరగా కైవసం చేసుకోవడంతో అద్భుతమైన ఆరంభం అందుకుంది. సుదీర్ఘ ర్యాలీ తర్వాత, కవాకమి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత సింధు పుంజుకుని.. 10-4 ఆధిక్యంలోకి వెళ్లింది. తరువాత సింధు దూకుడుగా ఆడుతూ జపాన్ షట్లర్ సయేనా కవాకమిని చిత్తు చేసింది.

    లండన్ 2012 కాంస్య పతక విజేత సైనా సెమీ ఫైనల్‌లో విఫలమైంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఆమె 13-21, 21-15, 20-21తో జపాన్‌కు చెందిన అయా ఒహోరి చేతిలో ఓడిపోయింది.

    spot_img

    Trending Stories

    Related Stories