ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ లో సింధు దూసుకుపోతోంది. క్వార్టర్ ఫైనల్ లో జపాన్ కు చెందిన యమగుచిపై విజయం అందుకుంది. మొదటి గేమ్ ను ఎంతో సులువుగా గెలిచిన సింధు.. రెండో గేమ్ లో పోరాడాల్సి వచ్చింది. అయితే ఆఖర్లో అద్భుతమైన స్మాష్ లతో విరుచుకు పడిన సింధు వరుసగా రెండు గేమ్స్ ను సొంతం చేసుకుని మ్యాచ్ లో విజయం సాధించింది. 21-13, 22-20 తేడాతో సింధు యమగుచిని ఓడించింది.
క్వార్టర్ ఫైనల్ ను సింధు దూకుడుగా ఆరంభించింది. భారత షట్లర్ తన జపాన్ ప్రత్యర్థిపై 2-0 తేడాతో విజయం సాధించింది. మొదటి గేమ్‌ను 21-13, ఆపై రెండో గేమ్ ను 22-20తో గెలిచింది. మొదటి గేమ్ లో ఆద్యంతం సైనా దూకుడు కనబర్చింది. ఎక్కడ కూడా యమగుచికి అవకాశం ఇవ్వలేదు. కానీ రెండో గేమ్ లో కూడా అదే తరహా ఆటను మొదట్లో కనబరచిన సింధు ఆ తర్వాత తడబడింది. ఒకానొక దశలో యమగుచి లీడ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా.. గేమ్ పాయింట్ వద్ద నిలిచింది. కానీ సింధు తేరుకుని స్కోర్ ను సమం చేయడమే కాకుండా 22 పాయింట్ల వద్ద నిలిచి మ్యాచ్ ను సొంతం చేసుకుంది.
సెకండ్ గేమ్ మాత్రం చాలా క్లోజ్ గా జరిగింది. యమగుచి దాన్ని దాదాపుగా గెలిచే స్థితికి వచ్చింది. కానీ సింధు దూకుడుగా ఆడి మరో గేమ్ వరకూ తీసుకెళ్లడానికి ఇష్టపడలేదు. గేమ్ 2 లో సింధు 22-20 విజయాన్ని సాధించి, తన ప్రత్యర్థిని 2-0తో ఓడించింది.