అయోధ్య రామరాజ్య రథయాత్ర విశాఖ జిల్లా సింహాచలం చేరుకుంది. కోలాటాలు, డప్పు వాయిద్యాల నడుమ భక్తులు రథానికి ఘన స్వాగతం పలికారు. దీంతో సింహాచలం రామనామంతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి రోజు ఆయోధ్యలో ప్రారంభమైన ఈ రథయాత్ర గీత జయంతి నాటితో ముగుస్తుంది. రథయాత్ర సుమారుగా 27 రాష్ట్రాల్లో 1500 కిలోమీటర్లు శ్రీ రాముల వారి చరిత్ర వివరిస్తూ సాగుతుంది.