సిక్కు మతాన్ని స్థాపించి.. ఆ మతానికి ప్రథమ గురువుగా బోధనలు చేసిన మహనీయులు గురునానక్. పాకిస్థాన్ లాహూర్ సమీపంలోని తల్వాండి గ్రామంలో నన్కానా సాహిబ్ లో కార్తీక పౌర్ణమినాడు సిక్కుమతాన్ని నెలకొల్పారు. గురునానక్ అనంతరం సాగిన గురు పరంపరలో.. తొమ్మిదో గురువుగా గురు తేగ్ బహుదూర్ గురుస్థానం పొందారు. 1665 నుంచి 1675 వరకు సిక్కు సంస్కృతికి పెద్ద దిక్కుగా నిలిచిన మహా గురువు తేగ్ బహదూర్. మిత్రులారా మహనీయులు, సిక్కుల 9వ మహా గురువు తేగ్ బహదూర్ మహత్తర గాథను చూసే ముందు మీరు చేయాల్సి పని గుర్తుంది కదా..! మన గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. పదిమందికీ ఈ వీడియోను షేర్ చేసి జాతీయవాద జర్నలిజానికి మద్దతు తెలపండి.
పంజాబ్ అమృత్ సర్ లో 1621 ఏప్రిల్ 1న గురు తేగ్ బహుదూర్ జన్మించారు. గురు హరగోవింద్ సింగ్, మాతా నానకి ఆయన తల్లిదండ్రులు. ఆయన తోబుట్టువు బాబా గుర్దిట్ట. గురు తేగ్ బహదూర్ జీవిత భాగస్వామి మాతా గుజ్రీ కాగా, ఈ దంపతుల కుమారుడు గురు గోవింద్ సింగ్. సుదీర్ఘకాలం.. అంటే 26 సంవత్సరాల 9 నెలల 13 రోజులపాటు గురు తేగ్ బహదూర్ బకాలాలో ధ్యానం చేశారు. ఆయన సమయాన్నంతా ధ్యానంలోనే గడిపిన కుటుంబాన్ని బాధ్యాతయుతంగానే చూసుకున్నారు.
సిక్కుల 8వ గురువు హర్ కిషన్ 1664 మార్చి నెలలో మశూచి వ్యాధికి గురై మరణించారు. అనంతరం సిక్కు సంగత్ తేగ్ బహదూర్ ను సిక్కుల 9 వ గురువుగా నిర్ణయించింది. 1664 ఆగస్ట్ నెలలో సిక్కుల 9 వ గురువుగా తేగ్ బహదూర్ పీఠం బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు.. దివాన్ దుర్గా మాల్ నేతృత్వంలోని సంగత్ గురుత్వాన్ని తేగ్ బహదూర్ కు ఇస్తూ అధికారిక లాంఛన యుతమైన తిక్కా వేడుకలు నిర్వహించింది. తొలి గురువు నానక్ స్ఫూర్తిని అందిపుచ్చుకుని గురు తేగ్ బహదూర్ రాసిన 115 కవితలు గురు గ్రంథ్ సాహిబ్ లో ఉన్నాయి. ఆయన రచనల్లో 116 శబద్ లు, 15 రాగాలు, సిక్కు మత సంప్రదాయంలోని బనిలో భాగమైన 782 కృతులు ఉన్నాయి. గురు గ్రంథ్ సాహిబ్ చివరిలో వచ్చే సలోక్ లు, ద్విపదలు సైతం ఆయన రచించిన వే అని సిక్కు గురువులు చెబుతున్నారు.
కశ్మీరీలను ప్రత్యేకించి కశ్మీరీ పండితులను ఔరంగజేబ్ ఊచకోత కోశాడని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో కశ్మీరీ హిందూ నాయకుడిగా పండిత్ కృపారామ్ అనే మహనీయులు ఉండేవారని చరిత్ర తెలియజేస్తోంది. పండిట్ కృపారామ్ ను కశ్మీరీ పండిట్లను బలవంతంగా ఇస్లాం మతంలోకి మారాలని ఔరంగజేబ్ హుకుం జారీ చేశాడు. ఈ అన్యాయపు, అక్రమ ప్రతిపాదనపై పండిట్ కృపారామ్ తీవ్ర కలత చెందాడు.
సరిగ్గా అదేసమయంలో.. ఓ మహిమాన్విత గురుదేవుల గురించి పండిట్ కృపారామ్ కు తెలిసింది. దీనికి పరిష్కారం చూపగల దైవాంశ సంభూతులు ఆయనే అని కశ్మీరీ పండిట్లకు అనిపించింది. వెంటనే పండిట్ కృపారామ్.. 1675 సంవత్సరంలో ఆ గురుదేవుల వద్దకు వెళ్లారు. ఆయన పాదాలపై పడి.. శరణువేడుకున్నారు.
ధర్మం నశించింది, ధార్మికత కనుమరుగైంది, మొగలాయిలు అసుర గణాల్లా ప్రవర్తిస్తున్నారని.. అకారణంగా వైర వాతావరణం కల్పిస్తున్నారని మొరపెట్టుకున్నారు. పవిత్ర హిందూ మతాన్ని త్యంజించ మంటున్నారని ఆవేదన చెందారు. పరాయి మతంలోకి చేరాలని బలవంత పెడుతున్నారని.. ఏకపక్షంగా వ్యవహరించి అనుచిత కార్యాలకు తెగబడుతున్నారని కన్నీటి పర్యంతయ్యారు. దారుణంగా హింసిస్తున్నారని.. మతం మారకపోతే ప్రాణాలు తీసేస్తామంటున్నారని గురువులకు విన్నవించుకున్నారు. ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని, హిందూ మతాన్ని మీరే రక్షించాలని.. ఔరంగ్ జేబ్ బారినుంచి కాపాడాలని తేగ్ బహదూర్ ను పండిట్ కృపారామ్ వేడుకున్నారు.
ధ్యాన సముద్రంలో వున్న ఆ గురుదేవులు.. చాలాసేపటికి కళ్లు తెరిచారు. గుండు సూది కిందపడితే వినిపించేటంత నిశ్శబ్దంలోంచి నెమ్మదిగా గురుదేవుని నోటి నుంచి చిన్నగా మాటలు వెలువడ్డాయి. మౌన ముద్ర వీడిన ఆ గురు దేవులు.. దీనికి బలిదానం అవసరం. ఆ బలిదానంతోనే మారణకాండ ఆగుతుంది అన్నారు. ఇందుకు పరమ ఉత్కృష్టుడైన తపోధనుడు, ధర్మవీరుడు అవసరం అన్నారు. అక్కడే వున్న ఓ తొమ్మిదేళ్ల బాలుడు.. గురుదేవా.. మీకంటే గొప్పవారైన.. ఆ ఉత్కృష్ట తపోధనులు, ధర్మవీరులు ఎక్కడ వుంటారు, మీరే ఆ త్యాగధనులు అన్నారు. ఆ గురుదేవులు చిరునవ్వు నవ్వారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్న భావన వెలిబుచ్చి.. నిజమే అన్నారు. పండట్ కృపారామ్ జీ.. తొలుత తనను మతం మార్చమని ఔరంగజేబ్ కు చెప్పండి. అనంతరం కశ్మీరీ హిందువులు మతం మారతారని తెలియజేయండి అన్నారు. ఆ గురు దేవులు మరెవరో కాదు.. సిక్కుల తొమ్మిదో గురువు తేగ్ బహదూర్. ఆ తొమ్మిదేళ్ల బాలుడు ఎవరో కాదు.. తేగ్ బహదూర్ కుమారుడు సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్.
1675 మే 25 న భవబంధాలు తెంచుకుంటూ తేగ్ బహదూర్ దేహత్యాగానికి బయలుదేరారు. అటువంటి సాహసం చేసిన వారు అరుదుగా కనిపిస్తారు. ప్రజలందరూ కళ్లనీళ్లు పెట్టుకుని.. ఆయన వెంట నడిచారు. తేగ్ బహదూర్.. అశేష జనవాహినితో కశ్మీరీ హిందు పండితులను కాపాడడానికి, ఇస్లాం మత మార్పిడికి వ్యతిరేకంగా వస్తున్నందుకు ఔరంగజేబ్ పట్టరాని ఆగ్రహం చెందాడు. నడిరోడ్డుపై క్రూరంగా, ఘోరంగా తేగ్ బహదూర్ తలను నరికించేశాడు. అయినా, ఆ మహనీయుడు కించిత్ బాధపడలేదు. భయపడలేదు. నవ్వుతూ..గ్రంథ పఠనం చేస్తూ..ఆ శిక్షను స్వీకరించారు.
గురువులు అందించిన సందేశాలను సిక్కులు శిరోధార్యంగా భావిస్తారు. గురు తేగ్ బహదూర్ ఇచ్చిన సందేశాల్లో భగవంతుడు ఎలాంటి వ్యక్తుల్లో ఉంటాడు అనే అంశంపై ప్రవచించిన వాక్కులు అద్భుతంగా వుంటాయి. దురదృష్టానికి చీకాకు పడని వాడు, భయాలు, బంధాలు, సుఖాల వెనకపడని వాడు, బంగారాన్ని మట్టిగా ఎంచేవాడిలో భగవంతుడు వుంటాడని ఆయన తమ ఆధ్యాత్మిక ప్రసంగాల్లో తెలిపారు. అదేవిధంగా, ఇతరుల గురించి చెడుగా మాట్లాడని వాడు, తన గురించి పొగిడితే పొంగిపోని వాడు, అసూయ,ద్వేషం, దురహంకారాలను దరి చేరకుండా చూసుకునే వానిలో భగవంతుడు కొలువై వుంటాడని తెలిపారు. ఉప్పొంగి పోవడం, కుమిలిపోవడం, ఈ రెండింటికీ అతీంతంగా వ్యవహరించేవాడు, అవమానాలు, సన్మానాల ప్రభావానికి లోను కానివాడు భగవంతునికి ప్రీతిపాత్రుడని చెప్పారు.
సిక్కు గురువులకు, కశ్మీర్ కు విడదీయరాని బంధం కనిపిస్తుంది. పండిత్ కృపారామ్ గురు గోవింద్ సింగ్ కు సంస్కృతం బోధించారు. కృపారామ్ పూర్వీకుడు పండిత్ బ్రహ్మరామ్ గురునానక తో కలిసి ఆధ్యాత్మిక అంశాలు చర్చించారు. తేగ్ బహదూర్ తండ్రి ఎనిమిదో గురువు హరగోబింద్ శ్రీనగర్ వెళ్లి కశ్మీరీ శైవ సన్యాసిని మాతా బాగ్ బారీతో కలిసి ఆధ్యాత్మిక చర్చాగోష్ఠిలు జరిపారు. ఇలా ఎన్నో సంబంధ, అనుబంధాలు సిక్కు గురువులకు, కశ్మీరీవాసులకు కలిగి వున్నాయి. తేగ్ బహదూర్ బలిదానాన్ని కశ్మీరీ హిందువులు గొప్పగా స్మరించుకుంటారు. ఆయనను హింద్ దీ చాదర్, హిందువుల రక్షకుడిగా అభివర్ణిస్తారు.
ఔరంగ్ జేబ్ సేనలు తేగ్ బహదూర్ ను 1675 నవంబర్ 24న దారుణంగా హతమార్చారు.. గురు ద్వారా సిస్ గంజ్ సాహిబ్, గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్ అన్న పేర్లతో ఢిల్లీ చాందినీ చౌక్ లో వున్న రెండు పవిత్ర ప్రదేశాల్లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. అవే.. గురు తేగ్ బహదూర్ పవిత్ర స్మృతి మందిరాలు. గురు తేగ్ బహదూర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నేషనలిస్ట్ హబ్ వినమ్ర నివాళులు అర్పిస్తోంది.