More

    పంజాబీ సింగర్ హత్య సూత్రదారి అరెస్ట్.. కాలిఫోర్నియాలో పట్టుబడ్డ గోల్డీ బ్రార్..!

    పంజాబీ గాయకుడు, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది..! సిద్ధూ మూసేవాలా హత్య కేసు సూత్రధారిగా గోల్డీ బ్రార్ అని చెబుతూ వచ్చారు. అయితే ఎట్టకేలకు అతడు పట్టుబట్టాడు. కాలిఫోర్నియాలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు భారత నిఘా వర్గాలు తెలిపాయి. మూసేవాలా పట్టుబడినట్టు అంతర్జాతీయ వర్గాల నుంచి భారత నిఘా సంస్థలకు సమాచారం అందినప్పటికీ, కాలిఫోర్నియా ప్రభుత్వం నుంచి భారత్‌కు అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను కాలిఫోర్నియాలో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు రా, ఐబీ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, పంజాబ్ ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద కచ్చితమైన సమాచారం ఉందని నేషనల్ మీడియా సంస్థలు చెబుతూ ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్ను నవంబర్ 20న కాలిఫోర్నియాలో అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి కాలిఫోర్నియా నుండి భారత ప్రభుత్వానికి ఇంకా అధికారిక ప్రకటన రాలేదని ఆ వర్గాలు తెలిపాయి.

    మూసేవాలా హత్యకు బాధ్యత వహించిన బ్రార్, కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరంలో నివసిస్తున్నట్లు తెలియగా.. శాక్రమెంటో, ఫ్రిజో, సాల్ట్ లేక్ వంటి నగరాలలో దాక్కుంటూ తప్పించుకుని తిరుగుతూ వచ్చాడు. సిద్ధూ మూసేవాలా ఈ ఏడాది మే 29న హత్యకు గురయ్యారు. వీఐపీ కల్చర్‌కు ముగింపు పలికే క్రమంలో పంజాబ్ ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ హత్య జరగడంతో కలకలం రేగింది. సిద్ధూ తన ఇద్దరు స్నేహితులతో బయటకు రావడంతో దుండగులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించారు.

    Trending Stories

    Related Stories