More

  శ్రద్ధ హత్యకు డేటింగ్ యాపే కారణమా..?

  ఢిల్లీ లవ్ జీహాద్ దేశాన్ని కుదిపేస్తున్న వేళ.. ఈ ఘటనపై చర్చ డేటింగ్ యాప్ ల వైపు మళ్ళింది. అఫ్తాబ్, శ్రద్దా వాకర్ ఇద్దరూ కూడా డేటింగ్ యాప్ ద్వారానే కలుసుకున్నారని తెలియడంతో.. డేటింగ్ యాప్ లపై తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు ఈ డేటింగ్ యాప్ లంటే ఏంటి..? వీటివల్ల కలిగే లాభనష్టాలేంటి..? ఈ యాప్ ల నుంచి గతంలో జరిగిన నేరాలేంటి..? అనే విషయాల గురించి తెలుసుకుందాం. కానీ, నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ ను సబ్ స్ర్కయిబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ను కూడా క్లిక్ చేసి.. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇక విషయానికి వస్తే.. ప్రపంచం అంతర్జాల మయమవుతున్న వేళ.. యువత డిజిటల్ ప్రపంచంవైపు పరుగులు పెడుతోంది. తల్లిదండ్రులు, స్నేహితులు అందరినీ ఒక్క వీడియో కాల్ తో కలుస్తున్నారు. ఉద్యోగం కోసం మెట్రో నగరాలకు వలస వచ్చిన వారంతా తల్లిదండ్రులను సైతం వీడియో కాల్ లోనే పలకరించే పరిస్థితి ఏర్పడింది. దీంతో పాత స్నేహితులందరూ దూరంగా ఉండటంతో కొత్త స్నేహితులను వెతుక్కునే దశలో డేటింగ్ యాప్ లను ఆశ్రయిస్తున్నారు. ఒకరికొకరు పరిచయంలేని వారిని కేవలం ఫోటోలను మాత్రమే చూపి వారిద్దరినీ కలిపే సాధనాలే ఈ డేటింగ్ యాప్ లు. వీటిని భారత్ లో దాదాపు మూడు కోట్లమంది వరకు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ డేటింగ్ యాప్ లు కొత్త స్నేహితులను పరిచయం చేస్తున్నా.. అదే స్థాయిలో నేరాలకు కూడా పునాదులు వేస్తున్నాయి. ఈ యాప్ లతో కొందరు డబ్బు పరంగా మోసపోతే, మరికొంతమంది ప్రాణాలనే కోల్పోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మతోన్మాద ముష్కరులు.. లవ్ జిహాద్ కోసం డేటింగ్ యాప్ లను వాడుతుండటం ఆందోళనకరంగా మారింది. తాజాగా శ్రద్ధ ఘటన దీనిని రుజువు చేస్తోంది.

  ఒక్క శ్రద్ధ మాత్రమే కాదు, ప్రతి రోజూ ఏదో ఒక మూల ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనేవున్నాయి. కొన్ని బయటికి పొక్కడం లేదంతే. అలాంటి ఘోరమైన ఘాతుకాలు కొన్నింటిని అవగతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో జైపూర్ లో టిండర్ అనే డేటింగ్ యాప్ వల్ల దుష్యంత్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. జైపూర్ కు చెందిన ఓ అమ్మాయి దుష్యంత్ అనే వ్యక్తి టిండర్ యాప్ ద్వారా కలుసుకుని కొన్నాళ్ళకు అతన్ని ట్రాప్ చేసి హత్య చేసింది. మరో ఘటనలో ఇద్దరు ప్రేమికులు టిండర్ డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నారు. అయితే ఈ జంటలో అమ్మాయికి పెళ్ళి కుదరటంతో ఆగ్రహించిన యువకుడు,.. అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం అతడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. వీటితో పాటు డేటింగ్ యాప్ లద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. యూపీలోని నోయిడాలో ఇద్దరు మహిళలు దాదాపు యాభైమందిని మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. మరో ఘటనలో ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఒక వ్యక్తికి డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై అతనితో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. అయితే కొన్నాళ్ళకు అతడిని హత్య చేసి యాభై లక్షల నగదును తీసుకుని ఉడాయించింది. ఇటువంటి ఘటనలు దేశవ్యాప్తంగా అనేకం జరిగాయి. దీంతో డేటింగ్ యాప్ లను నమ్మాలా వద్దా అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి.

  అయితే ఈ డేటింగ్ యాప్ లను ఉపయోగించడం నైతికమా అనైతికమా అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతూ ఉంది. వీటి వాడకాన్ని ప్రభుత్వాలు నిషేధించాలని కొంతమంది కోరుతుంటే,.. వీటివల్ల కొత్త వారిని కలుసుకునే అవకాశమేర్పడుతుందని మరికొందరు భావిస్తున్నారు. దీంతో వీటి వాడకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో,.. ఈ యాప్ లను వాడేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. డేటింగ్ యాప్ ల ద్వారా పరిచయమైన వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అవతలి వ్యక్తి స్వభావమేంటి అనే దానిపై పూర్తిగా ఆరా తీయాలి. వారు తమ వద్ద ఏవైనా నిజాలను దాస్తున్నారా..? అనే విషయాలను పూర్తిగా తెలుసుకున్నాకే వారితో స్నేహం చేయాలి. లేకపోతే అఫ్తాబ్ లాంటి వారిచేతిలో మోసపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.

  Trending Stories

  Related Stories