More

  అసదుద్దీన్.. ఎందుకీ అ‘శ్రద్ధ’..! మరి, ఆ లేఖకు సమాధానమేది..?

  విమర్శ చేసేటప్పుడు అది సహేతుకంగా, అర్థవంతంగా వుండాలి. ఇది సత్ విమర్శలు చేసేవారి లక్షణం. అయితే, అసలు సమస్యనే పక్కదారి పట్టించేలా విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తే..అందులో అర్థం ఏముంటుంది. శ్రద్ధా వాకర్ హత్య కేసును హిందు, ముస్లిం సమస్యగా ఎందుకు మార్చాలని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. అసలు సమస్యే అక్కడ నుంచే పుట్టుకొచ్చి.. లవ్ జిహాద్ వ్యవహారం అని స్పష్టంగా తేలిపోతుంటే,.. బీజేపీ పిచ్చిమాటలు మాట్లాడుతోందని, మతం రంగు పులిమేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అంటున్నారు. ఇంకా, మోదీ హయాంలో నిరుద్యోగం పెరిగిందని, అస్సాం సీఎం అర్థం లేని మాటలు మాట్లాడేస్తున్నారని, మహిళలపై నేరాలు అరికట్టాలని యూఎన్ వో చెప్పిందని.. పొంతన లేని రీతిలో రాజకీయ విమర్శలు గుప్పించాడు. దేశం ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా వాకర్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ, ఉత్కంఠ గా సాగుతుంటే అసదుద్దీన్ ఒవైసీ చేస్తున్న విమర్శలు ఇంత గొప్పగా వున్నాయి మరి..! మిత్రులారా ఈ అంశాన్ని చూసే ముందు మీరు చేయాల్సి పని గుర్తుంది కదా..! మన గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. పదిమందికీ ఈ వీడియోను షేర్ చేసి జాతీయవాద జర్నలిజానికి మద్దతు తెలపండి.

  ఢిల్లీలో అఫ్తాబ్ పూనావాలా చేతిలో హత్యకు గురైన శ్రద్ధా వాకర్, ఆఫ్తాబ్ నేరపూరిత చరిత్రను రెండేళ్ల క్రితమే పోలీసులకు తెలియజేసింది. మతం మారాలంటూ.. తనను ఆఫ్తాబ్ తీవ్రంగా కొట్టాడని, చంపి ముక్కలు చేసి పారేస్తానని బెదిరించాడని.. శ్రద్దా మహారాష్ట్ర వసాయ్ పోలీస్ స్టేషన్ కు రెండు సంవత్సరాల క్రితం లేఖ రాసినట్టు తెలిసింది. శ్రద్దా ఫిర్యాదులో కీలక విషయాలు ప్రస్తావించినట్టు వెల్లడైంది. ఆఫ్తాబ్ చెడు ప్రవర్తన గురించి అతని తల్లితండ్రులకు తెలుసని ఆమె లేఖలో వెల్లడించింది. ఆరు నెలల క్రితం ఆ కిరాతకుడు అన్నంత పని చేసేశాడు. శ్రద్ధా వాకర్ గొంతు కోసి, హత్య చేసి, 35 ముక్కలు చేసి, ఫ్రిజ్‎లో పెట్టాడంటే.. ఆ నేరగాడు ఎంత గుండెలు తీసిన దుర్మార్గుడో అర్థం అవుతోంది.

  శ్రద్ధా కేసు గురించి దేశంలో ఇంత వివాదం చెలరేగుతుంటే,.. ఆ విషయానికి స్వల్ప ప్రాధాన్యం ఇచ్చి.. ప్రతి క్రూరమైన నేరాన్ని ఖండించాలని సెలవివ్వడం అసదుద్దీన్ కే చెల్లింది. మహిళలపై ఏదైనా నేరం జరిగితే దానిని ఖండించాలని అన్నారు. ప్రతి రోజు ఈ తరహా నేరాల గురించి వింటూనే వుంటామని సింపుల్ గా కొట్టిపారేశారు.

  గుజరాత్ ఎన్నికల పోరు జోరుగా సాగుతున్న వేళ..బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, అసదుద్దీన్ ఒవైసీ తమ అస్త్రాలతో ఎన్నికల పోరాటంలోకి దిగారు. ఈ నేపథ్యంలో శ్రద్ధా వాకర్ హత్య కేసు గురించి ఎవరి వ్యాఖ్యానాలను వారు చేసేస్తున్నారు. శ్రద్ధా కేసును కేసును లవ్ జిహాద్ గా బిస్వాశర్మ అభివర్ణించగా, ఆయనను మానసిక వ్యాధిగ్రస్థునిగా అసదుద్దీన్ తేల్చేశారు. అస్సాం సీఎం రాజకీయ క్రీడలు సాగిస్తున్నారని ఉక్రోషం వెళ్లగక్కారు.

  లోపాయకారిగా స్నేహ హస్తం అందించే కాంగ్రెస్ పైనా.. ఓవైసీ మొక్కబడి విమర్శలు చేసేశారు. గుజరాత్ వచ్చి ఆటను చెడగొట్టేస్తున్నారని కాంగ్రెస్ అంటోందని, అయితే అమేధీలో ఎందుకు కాంగ్రెస్ ఓటమి పాలైందని ప్రశ్నించారు. తాము అక్కడ పోటీ చేయలేదని చెప్పారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ తమపై పోరాటం సాగిస్తే.. తాము ఏడవ లేదని.. ఏవో నోటి చివరి నుంచి రెండు మాటలను అనేసినట్టు బిల్డప్ ఇచ్చేశారు. ఇవన్నీ నెటిజన్లు, సిటిజన్లు చేస్తున్న విమర్శలు.

  Trending Stories

  Related Stories