కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మరోసారి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అవ్వడంతో దీనిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలని కోరుతూ గతంలో క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 22న నోటీసులు జారీ చేసింది. ఈనెల 1వ తేదీతో పది రోజుల గడువు ముగిసింది. ఇంతవరకు వెంకట్ రెడ్డి షోకాజ్ నోటీసుపై సమాధానం ఇవ్వలేదు. షోకాజ్ నోటీసులు జారీ చేసే సమయంలో ఆయన ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ నెల రెండన వెంకట్ రెడ్డి పర్యటన ముగించుకుని వచ్చారు. పది రోజులు ముగిసినా.. ఇంకా సమాధానం రాకపోవడంతో సమాధానం కోసం వెంకట్ రెడ్డి కార్యాలయాన్ని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ సంప్రదించింది. విదేశీ టూర్‌లో ఉన్నందున నోటీసు తమకు అందలేదని వెంకటరెడ్డి కార్యాలయం కమిటీకి సమాధానం ఇచ్చింది. మరోసారి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.