National

ఆర్ఎస్ఎస్ ను తాలిబాన్లతో పోల్చిన జావేద్ అక్తర్ కు షోకాజ్ నోటీసులు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ను తాలిబాన్లతో పోలుస్తూ కొద్దిరోజుల కిందట వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్. ఆయనకు థానే కోర్టు తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్‌ను తాలిబాన్లతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ కు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వివేక్ చంపనేర్కర్ పరువునష్టం దావా దాఖలు చేశారు. 76 ఏళ్ల జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలపై పరిహారంగా ఒక రూపాయి చెల్లించాలని కోరుతూ వివేక్ చంపనేర్కర్ దావా వేశారు. అందులో భాగంగా థానే నగర అదనపు చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్, జాయింట్ సివిల్ జడ్జి జావేద్ కు షోకాజ్ నోటీసులు పంపించారు. జావేద్ అక్తర్ నవంబరు 12వతేదీన కోర్టులో హాజరు కావాలని జడ్జి ఆదేశించారు. ‘‘తాలిబన్లు ఇస్లామిక్ దేశాన్ని కోరుకుంటున్నారు. ఈ ప్రజలు హిందూ రాష్ట్రాన్ని చేయాలనుకుంటున్నారు’’ అని అక్తర్ ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ షోలో వ్యాఖ్యలు చేశారు.

ఫిర్యాదుదారుడి తరఫున హాజరైన అడ్వకేట్ ఆదిత్య మిశ్రా కోర్టులో సుదీర్ఘంగా వాదించారు. అక్తర్ ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని మిశ్రా తెలిపారు. చంపానేర్కర్ తన పిటిషన్‌లో అక్తర్ చేసిన ప్రకటనలు సామాన్య ప్రజల దృష్టిలో ఆర్‌ఎస్‌ఎస్ ఇమేజ్‌ని కించపరచడమే లక్ష్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. జావేద్ అక్తర్ చేసిన నిరాధారమైన, తప్పుడు ఆరోపణల వల్ల తమ పరువుకు నష్టం జరిగిందని, అందువల్ల అతను ఒక రూపాయిని పరిహారంగా చెల్లించాలని చంపానేర్కర్ కోరారు.

జావేద్‌ అక్తర్‌ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జావేద్‌ అక్తర్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు నిర్వహించారు. జావేద్‌ వ్యాఖ్యలను విశ్వ హిందూ పరిషత్‌ కూడా ఖండించింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారంటూ జావేద్‌పై వీహెచ్‌పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబాన్లు మహిళల పట్ల వ్యతిరేక ధోరణి గలిగినవారు, హింసను ప్రేరింపించే ఒక ఉగ్రవాద సంస్థ. అటువంటి సంస్థలతో పోలికేమిటీ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. జావేద్ అక్తర్ పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ కూడా వచ్చాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

1 + 16 =

Back to top button