విచారణకు హాజరైన పరమశివుడు

0
835

భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమశివుడు కోర్టు విచారణకు హాజరయ్యారు. పరమశివుడు (విగ్రహం) ఒక్కడే కాదు ఆయనతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 9 మంది కూడా విచారణకు హాజరయ్యారు. చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే బిలాస్‌పూర్ హైకోర్టులో ఓ పిటిషన్ వేస్తూ.. ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఆ భూమిలో ఉన్న శివాలయం సహా 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. RGHNews, స్థానిక మీడియా ప్లాట్‌ఫారమ్, ఆలయంలోని శివలింగాన్ని హ్యాండ్ ట్రాలీపై కోర్టుకు తీసుకువెళుతున్నట్లు చూపించే ఫోటోగ్రాఫ్‌లు మరియు వీడియోలు చూడవచ్చు. కోర్టులో అధికారులు లేకపోవడంతో విచారణ రద్దు చేయబడిందని, ఏప్రిల్ 13న హాజరుకావాలని నిర్ణయించారు. లైవ్‌బీట్ నివేదిక ప్రకారం, ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో సుధా రాజ్‌వాడే దాఖలు చేసిన పిటిషన్ ఫలితంగా ఈ పని జరిగింది, ఇందులో శివాలయంతో సహా 16 మంది ప్రభుత్వ ఆస్తులను అతిక్రమించారని ఆరోపించారు.

పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ కేసును దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన తహసీల్దార్ కార్యాలయం ప్రాథమిక విచారణ ప్రారంభించి 10 మందికి నోటీసులిచ్చింది. ఈ నెల 25న జరగనున్న విచారణకు హాజరై భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణకు హాజరుకాకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. చర్యల్లో భాగంగా భూమిని ఖాళీ చేయించి రూ. 10 వేల జరిమానా విధించాల్సి వస్తుందని అందులో పేర్కొనడంతో.. నోటీసులు అందుకున్న శివుడితోపాటు 9 మంది కోర్టు విచారణకు హాజరయ్యారు. గుడిలోని శివలింగాన్ని రిక్షాలో కోర్టుకు తీసుకొచ్చి హాజరు పరిచారు.