ఐసీయూ బెడ్ పై శివ శంకర్ మాస్టర్.. ఆదుకోవాలంటూ

0
956

శివశంకర్ మాస్టర్.. ప్రముఖ కొరియోగ్రాఫర్..! పలు టీవీ షోలు, సినిమాల ద్వారా ఆయన బాగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. కరోనా సోకడంతో గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుక్కి కూడా కరోనా సోకగా.. ఆయనకు కూడా సీరియస్ అయ్యి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ఇక శివ శంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకగా.. ఆమెకు హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. శివ శంకర్ మాస్టర్ కు చికిత్స అందించడం కష్టమవుతోందని ఆయన చిన్న కొడుకు అజయ్ తెలిపారు. రోజుకు లక్షల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు అవుతోందని అన్నారు.

శివశంకర్ మాస్టర్ భార్య మాత్రం హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. శివశంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా పదికిపైగా భాషల్లో పనిచేశారు. 800కుపైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. తెలుగులో మగధీర సినిమాలోని ‘ధీర.. ధీర..’ పాటకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. నాలుగుసార్లు తమిళనాడు ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నారు. నటుడిగానూ కొన్ని సినిమాలు చేశారు. టీవీ షోలకు జ‌డ్జ్‌గా వ్యవహరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించిపై వస్తున్న వార్తలు సినీ అభిమానులను కలవర పెడుతున్నాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శివ శంకర్ మాస్టర్ కు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం అని.. ఆయన త్వరగా కోలుకోవాలని చిత్ర పరిశ్రమకు చెందిన వారు కోరుకుంటున్నారు.