National

ఊహించని విధంగా ఎన్డీఏ అభ్యర్థికి జై కొట్టిన శివసేన

ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన కీలక ప్రకటన చేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఉద్దవ్ ఠాక్రే సమావేశమయ్యారు. వారంతా ముర్ముకే మద్దతు ఇవ్వాలని తెలిపారు. దీంతో ఆ పార్టీ అధిష్టానం సైతం సానుకూలత వ్యక్తం చేసింది. రాష్ట్రపతి అభ్యర్థి గిరిజన మహిళ కావడంతో ద్రౌపది ముర్ముకే శివసేన జై కొట్టింది. మొత్తం 22 ఎంపీలకు గాను 16 మంది సభ్యులు షిండే వర్గంలో ఉన్నారు. మిగిలిన వారు ఠాక్రే వైపు ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థికే శివసేన మద్దతు ఇస్తున్న విషయాన్ని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ప్రతిపక్షం బలంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని.. గతంలో ఎన్డీయే అభ్యర్థికి కాకుండా ప్రతిభా పాటిల్‌కు మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. యశ్వంత్ సిన్హా విషయంలోనూ తాము సానుకూలంగా ఉన్నామన్నారు సంజయ్ రౌత్.

Related Articles

Back to top button