More

    కాలిపోయిన కూకట్ పల్లి శివ పార్వతి థియేటర్..!

    హైదరాబాద్ కూకట్‌పల్లిలోని శివపార్వతి థియేటర్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు థియేటర్ మొత్తాన్ని చుట్టుముట్టాయి. హాలులోని స్క్రీన్, కుర్చీలు, ఇతర సామగ్రి కాలిబూడిదైంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో పైకప్పు కూలిపోయింది. థియేటర్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే థియేటర్ వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివపార్వతి థియేటర్‌లో ప్రస్తుతం శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా నడుస్తోంది. ప్రమాదంలో దాదాపు రూ. 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

    Image

    ఆదివారం రాత్రి థియేటర్ లో శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా సెకండ్ షో ముగిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. థియేటర్ కాలిపోతోన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అదృష్టవశాత్తూ అగ్నిప్రమాదం జరిగినప్పుడు థియేటర్ సిబ్బంది కూడా అక్కడ లేకపోవడంతో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. థియేటర్ లోపలి భాగంలో మంటలు రాజుకోవడంతో తెర, కుర్చీలు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. థియేటర్‌ లోపలి నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది లోనికి వెళ్లి చూడగా అగ్నికీలలు కనిపించాయి. దీంతో వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందితో యాజమాన్యానికి సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది మూడు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

    Image
    Image

    Trending Stories

    Related Stories