More

    చ‌ర్చిపైకి ఎక్కి.. శిలువ‌కు నిప్పుపెట్టాడు

    సగం దుస్తులు మాత్రమే ధరించిన కాలిఫోర్నియా వ్యక్తి చర్చి బెల్ టవర్ పైకి ఎక్కి శిలువకు నిప్పు అంటించాడు. అధికారులు వెంబడించడంతో భవనాల పైకప్పుల మీదను దూకుతూ పారిపోడానికి ప్రయత్నించాడు. లాస్ ఏంజిల్స్‌లోని బాయిల్ హైట్స్ పరిసరాల్లోని నాలుగు అంతస్థుల సెయింట్ మేరీస్ కాథలిక్ చర్చి పైభాగంలో అతడు ఉండడాన్ని చూశారు. అతడు శిలువకు నిప్పు పెడుతూ కనిపించాడు. ఆ వ్యక్తి షర్ట్‌లెస్‌గా కనిపించాడు.

    FOX11 Los Angeles మీడియా సంస్థ హెలీకాప్టర్ లో నుండి ఈ తతంగాన్ని రికార్డు చేసింది. చ‌ర్చిపైకి ఎక్కి అక్కడ ఉన్న శిలువ‌కు నిప్పుపెట్టాడు. ఒక బిల్డింగ్ మీద నుంచి మ‌రో బిల్డింగ్ మీద‌కు దూకుతూ త‌ప్పించుకున్నాడు. లాస్ ఏంజిల్స్ కు చెందిన‌ ఫాక్స్‌-11 అనే మీడియా సంస్థ కెమెరాకు చిక్కింది. ఫాక్స్‌-11 సిబ్బంది హెలిక్యాప్ట‌ర్ పై నుంచి న‌గ‌రానికి సంబంధించిన వీడియోలు తీసుకుంటుండ‌గా ఈ వీడియో రికార్డ‌య్యింది. నాలుగంత‌స్తులు ఉన్న ఈ చ‌ర్చి శిఖ‌రంపైకి ఓ వ్య‌క్తి కేవ‌లం ఒంటిపై డ్రాయ‌ర్‌తో ఎక్కాడు. అనంత‌రం దానిపై ఉన్న ఏసుక్రీస్తు శిలువ‌కు నిప్ప‌టించాడు. ఆ త‌ర్వాత ఒక భ‌వ‌నం మీద నుంచి మ‌రో భ‌వ‌నం మీద‌కు దూకుతూ పారిపోయాడు. మంట‌లు చ‌ర్చిలోప‌లికి వ్యాపించ‌క‌పోవ‌డంతో అధికారులు ఊపిరి పీల్చీకున్నారు. వెంట‌నే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పివేశారు. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ స‌మ‌యంలో నిందితుడి ఒంటిపై డ్రాయ‌ర్ త‌ప్ప ఏమీ లేద‌ని పోలీసులు చెప్పారు. ఘ‌ట‌న‌కు సంబంధించి అత‌డిని ఇంటరాగేట్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

    అతను చర్చి పైకి ఎక్కి ఒక పైకప్పు నుండి పైకప్పుకు చాలాసార్లు దూకడం చూడవచ్చు. అతను భవనాలను పైకి ఎక్కడానికి, దిగడానికి వేలాడుతున్న వైర్లను కూడా ఉపయోగించాడు. పైకప్పులు దూకుతున్న సమయంలో ఆ వ్యక్తి చాలాసార్లు గాయపడ్డాడు. లాస్ ఏంజిల్స్ పోలీసులు అతడిని పట్టుకోవడాన్ని ప్రయత్నించగా.. తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. ఎట్టకేలకు అతడిని పోలీసులు పట్టేసుకున్నారు.

    Trending Stories

    Related Stories